జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఓకే.. రాష్ట్ర బీజేపీలో గుబులు..!

ఏపీ సీఎం జ‌గ‌న్ తో క‌య్యం పెట్టుకుని.రోజుకో విమ‌ర్శ చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు మ‌రింత‌గా గుండెల్లో గుబులు పుట్టించే సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

 Centre Green Signal To Jagan Request..ap Bjp Leaders Worry, Ap Bjp, Centre, Gree-TeluguStop.com

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు.జ‌గ‌న్ స‌ర్కారుకు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

పైకి ప్ర‌చారం కాక‌పోయినా.లోలోన మాత్రం వైసీపీకి అనుకూలంగానే కేంద్రం అడుగులు వేస్తోంది.

అయితే.ఎన్ని స‌హ‌కారాలు చేసినా.

కీల‌క‌మైన పోల‌వ‌రం విష‌యంలో మాత్రం స‌హ‌క‌రించ‌క‌పోతే.ఎలా అంటూ.

ఇటీవ‌ల జ‌గ‌న్ కొంత ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.దీంతో వెంట‌నే ఆయ‌న ఢిల్లీకి వెళ్లి అమిత్ షా ముందు త‌మ ప్ర‌తిపాద‌న కూడా పెట్టారు.

పోల‌వ‌రం విష‌యంలో ప్ర‌స్తుత అంచ‌నాల‌ను ఆమోదించి స‌హ‌క‌రించాల‌ని జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు.

అయితే.

కేంద్రం ఇంత మొత్తం ఇస్తుందో .లేదో.అనే సందేహం అయితే.ఉంది.దీనిపై రాజ‌కీయంగా కూడా.పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి శుభ వార్త అందిన‌ట్టు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం శుభవార్తను అందించింది.

పోలవరం అంచనా వ్యయంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించింది.పోల‌వ‌రం అంచ‌నా వ్య‌యం.55,548.87 కోట్ల రూపాయలని అధికారికంగా ప్రకటన జారీచేసింది.జలశక్తి శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమీక్షలో ఈ వివ‌రాలు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అయితే.ఇది కేవ‌లం ఒక్క ప్రాజెక్టుకే ప‌రిమిత‌మైన విష‌యం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కారుకు ఇది ప్ర‌తిష్టాత్మ‌కం అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్రాజెక్టును పూర్తి చేయ‌డం ద్వారా.ఇక‌, తిరుగులేని మెజారిటీ సాధించేందుకు జ‌గ‌న్‌కు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే.అదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు.

ఎందుకంటే.రాష్ట్రం అభివృద్ది చెంద‌డానికి నిధులు తామే ఇచ్చామి చెప్పుకొంటున్నా.

ఆదిశ‌గా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు పైగా.పోల‌వ‌రం వంటి కీల‌క ప్రాజెక్టు కు నిధులు తెప్పించే విష‌యంలో బీజేపీ రాష్ట్ర నాయ‌కులు చేసిన ప్ర‌య‌త్నం కూడా ఏమీలేదు.

Telugu Amit Shah, Ap Bjp, Ap Cm, Bjp, Delhi, Green Signal, Polavaram, Project, W

దీంతో ఇప్పుడు కేంద్రం భారీ ఎత్తున అంచ‌నాల‌ను ఓకే చేసి.రికార్డు స్థాయిలో ప్ర‌క‌ట‌న చేసినా.దీనిని త‌మ‌కు అనుకూలంగా బీజేపీ ఉప‌యోగించే అవ‌కాశం లేకుండా  పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పోల‌వ‌రం అంచ‌నాల విష‌యం త‌లెత్తిన ర‌గ‌డ‌ను.బీజేపీ మ‌రింత రాజ‌కీయం చేసింది.

దీంతో.ఈవిష‌యంలో వైసీపీనే కేంద్రం వ‌ద్ద‌కు ప‌లుమార్లు తిరిగి అంచ‌నాల‌ను ఆమోదింప జేసుకుంది.

సో.ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కూడా వైసీపీకే చెందుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.దీంతో బీజేపీ నేత‌ల గుండెల్లో గుబులు చోటు చేసుకుంద‌ని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube