కరోనా మహమ్మారి కి మరో ఔషధం,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

చైనా లోని వూహన్ లో జన్మించి ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా మహమ్మారి కి సంబంధించి మరో ఔషధాన్ని కేంద్రం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.కరోనా మహమ్మారి కి సంబంధించి డెక్సా మేథ సొన్ అనే స్టెరాయిడ్ ను కరోనా బాధితులకు చికిత్సలో వాడేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.

 Centre Gives Nod For Dexamethasone In The Use Of Corona Treatment, Coronavirus,d-TeluguStop.com

వూహన్ లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు పాకడం తో ప్రస్తుతం ఈ మహమ్మారి ని నియంత్రించే పనిలో పడ్డాయి ప్రపంచ దేశాలు.ఈ క్రమంలోనే భారత్ లో డెక్సామెథసోన్ అనే స్టెరాయిడ్ ను కరోనా బాధితులకు చికిత్సలో వాడేందుకు అనుమతి ఇచ్చారు.

తీవ్ర వ్యాధి లక్షణాలతో బాధపడేవారిలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఇన్ ఫ్లమేషన్ (బాధతో కూడిన వాపు) స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు డెక్సామెథసోన్ వాడొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.ఈ మేరకు కరోనా రోగుల చికిత్స, నిర్వహణ నియమావళిని సవరించింది.

మిథైల్ ప్రెడ్నినిసోలోన్ కు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.డెక్సామెథసోన్ ఔషధాన్ని 6 దశాబ్దాలుగా వైద్యరంగంలో వినియోగిస్తున్నారు.

1977 నుంచి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాల జాబితాలో ఉంటోంది.దీనిపై ఎవరికీ పేటెంట్ లేకపోవడంతో అన్ని దేశాల్లోనూ అందుబాటు ధరల్లోనే లభ్యమవుతున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల బ్రిటన్ లో జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో కరోనా బాధితులకు స్వస్థత కలిగించడంలో డెక్సామెథసోన్ మెరుగైన ఫలితాలను ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube