పన్ను చెల్లింపుదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం .. !

కరోనా వల్ల ప్రతి వారికి జనం మీద జాలి పుడుతుంది.కానీ కొందరు చూపించే సానుభూతి వల్ల కడుపులు నిండటం లేదు.

 Centre Extends Income Tax Returns Deadline, Centre Extends, Income Tax, Returns,-TeluguStop.com

ముఖ్యంగా ఏవేవో సాకులు చెబుతు ప్రభుత్వాలు నిత్యావసరాలైన వస్తువుల ధరలను అడ్డగోలుగా పెంచేసింది.అదీగాక పెట్రోల్ అయితే సల సల కాగిపోతుంది.

అసలు పేదవారి పాలిట కష్టకాలంగా ఉన్న ఈ రోజుల్లో వారి కడుపు నిండాలంటే ధరలు అందుబాటులో ఉండాలి కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాలూ వేరే విషయాల పై దృష్టి పెట్టడం జనం దురదృష్టం.ఇకపోతే పన్ను చెల్లింపుదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఐటీ రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబరు 30 వరకు, కంపెనీలు ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు నవంబరు 30 వరకు అవకాశం కల్పించింది.

ఇదేకాకుండా ఫారం-16 గడువును కూడా జూలై 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వీటితో పాటుగా ట్రాన్సఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ల దాఖలుకు నవంబరు 30, ట్యాక్స్ ఆడిట్ రిపోర్టుల దాఖలుకు అక్టోబరు 31 వరకు గడువు పెంచుతున్నత్లుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలిపింది.ఇకపోతే ఐటీ రిటర్నుల దాఖలుకు పాత పోర్టల్ బదులుగా www.incometaxgov.in కొత్త పోర్టల్ జూన్ 7 నుంచి అందుబాటులోకి తేనున్నామని అధికారులు తెలియచేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube