హైదరాబాద్ విషయంలో కేంద్రం ఏం ఆలోచిస్తోంది ?

ఎప్పటి నుంచో భారత దేశానికీ చిక్కుముడిలా ఉన్న కాశ్మీర్ సమస్యను కేంద్రం ఒక్కరోజులో పరిష్కారం చూపించింది.ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా బీజేపీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

 Centralgovernament Thinkingabout Hyderabad-TeluguStop.com

మోదీ, అమిత్ షా లు ఇద్దరూ ఈ విషయంలో హీరోలు గా మారిపోయారు.ఈ సంగతి పక్కనపెడితే ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో బాగా బలపడాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం తమ దృష్టంతా తెలంగాణ మీద పెట్టింది.అందులో భాగంగానే హైదరాబాద్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

దేశంలో రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.కొన్ని రాజకీయ పార్టీలు గతంలో ఈ డిమాండ్ లు కూడా చేసాయి.

-Telugu Political News

తెలంగాణాలో ఉన్నహైదరాబాద్ ను రెండో రాజధానిగా కేంద్రం ప్రకటించడం ద్వారా దక్షిణాది బాగా అభివృద్ధి చెందుతుందని గతంలో కొంతమంది నాయకులు డిమాండ్ చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయిన తరువాత తెలంగాణా రాజధానిగా హైదరాబాద్ ఉంది.ప్రస్తుతం కేంద్రం హైదరాబాద్ ను రెండో రాజధానిగా ప్రకటిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.ప్రస్తుతం ఢిల్లీ వలే హైదరాబాద్ ను కూడా ఒక రాష్ట్రంగా మార్చి దానికి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి రెండో రాజధానిని ఏర్పాటు చేయవచ్చనే ఊహాగానాలు బయలుదేరుతున్నాయి.

అదే కనుక జరిగితే తెలంగాణా భారీగా నష్టపోవాల్సి వస్తుంది.ఎందుకంటే తెలంగాణకు ఆదాయం ఎక్కువగా హైదరాబాద్ నుంచే వస్తోంది.

-Telugu Political News

ఒకవేళ కేంద్రం కనుక ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే అప్పుడు తెలంగాణ అధికార పార్టీ బీజేపీ ఎలా స్పందిస్తుంది ? మిగతా రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది ఇప్పుడు తెరమీదకు వస్తోంది.అయితే కొంతమంది మాత్రం హైదరాబాద్ ను రెండో రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి తమ ఆధీనంలో పెట్టుకుంటుందని దీనికి ప్రధాన కారణం కూడా ఉందని చెబుతున్నారు.అదేంటి అంటే దేశం లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడ జరిగినా దాని మూలాలు ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉంటున్నాయి.శాంతి భద్రతల విషయంగా చూసుకున్నా హైదరాబాద్ విషయంలో ముందడుగు వేయడమే కరెక్ట్ అన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube