కేసీఆర్ తో పోలవరం కధ నడపనున్న కేంద్రం       2018-06-07   02:58:29  IST  Bhanu C

పోలవరం పై కేంద్రం ఎన్నిరకాల కుట్రలు చేయాలో అన్ని రకాలుగా చేయడానికి సిద్దపడింది…పోలవరం పూర్తీ అయితే మాకు ఏమి వస్తుంది అందుకే చంద్రబాబు కే క్రెడిట్ అంతా వస్తుంది కాబట్టి ఎలా అయినా సరే పోలవరం పనులని ఆపేయాలని కంకణం కట్టుకుంది కేంద్రం అయితే అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఎదో ఒక రూపంలో అడ్డు పుల్ల వేస్తూ వస్తున్నా కేంద్రం ఇప్పుడు ఏకంగా కేసీఆర్ తో నే పోలవరం డ్రామని నడిపించడానికి సిద్ద పడ్డారు అంతేకాదు అందుకు తగ్గట్టుగా చక చకా పనులు కూడా చేసుకు పోతున్నారు.

పోలవరం ప్రాజక్ట్ ని కేంద్రం ముందుకు నడిపించలేక చేతుల ఎత్తేసింది..ఆ సమయంలో చంద్రబాబు కి ఈ అవకాసం కల్పించింది..అయితే 2016 ఈ భాద్యత తీసుకున్న చంద్రబాబు ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టించడం చూసిన కేంద్రం ఒక్క సారిగా ఉలిక్కిపడింది..ఇది గనుకా పూర్తీ అయితే ఎక్కడ ఏకు మేకవుతాడోనని అనుకున్న కేంద్రం అప్పటి నుంచీ అడ్డుపుల్లలు వేస్తూ వచ్చింది..ఈ విషయాలు అన్నీ అందరికీ తెలిసినవే అయితే

ఇప్పుడు కేంద్రం కుట్రలో భాగంగా పోలవరం ఆపే పనిలో తెలంగాణా ముఖ్యమంతి కేసీఆర్ ని రంగంలో దింపుతున్నారు..అంతేకాదు పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోపాటు , ప్రాజెక్ట్ నిలిపివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి పలు దఫాలు లేఖలు రాశారు. ఏపీకి బదిలీ చేసిన ముంపు మండలాల్లోనే కాకుండా మరింత ఎక్కువగా ముంపు ఉంటుందని, దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆ తరువాతే ప్రాజెక్ట్ ముందుకు కదిలేలా చూడాలని తెలంగాణ కోరుతోంది.

కేంద్రం కేసీఆర్ ని అనూహ్యంగా రంగంలోకి దింపడం వెనుక ఆంతర్యం ఏమిటో ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలు కొట్టుకుని చావడానికి ఈ గొడవలలో మళ్ళీ ఓటుకు నోటు కేసు బయటకి తీయించి మళ్ళీ చంద్రబాబు ని ఇబ్బంది పెట్టాలనేది మోడీ వ్యూహంగా తెలుస్తోంది..ఒక పక్క పోలవరం పనులని ఆపేలా చేయడం మరో పక్క ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకి గొడవలు పెట్టి అల్లర్లు సృష్టించడం ఇదే ఏపీలో మోడీ వ్యూహంగా తెలుస్తోంది..ఏది ఏమైనా మోడీ చంద్రబాబు ని ఎదుర్కోవడం కోసం పోలవరం పనులని ఆపేసే వ్యుహలని రచించడం ఎంతో దారుణమైన విషయమని అంటున్నారు విశ్లేషకులు.