తిరుమలలో రాళ్ల దాడి పై తాట తీస్తోన్న కేంద్రం !       2018-05-21   22:33:01  IST  Bhanu C

గిల్లి గిల్లించుకోవడం అంటే ఏంటో ఇప్పుడు టీడీపీ నేతలకు బాగా తెలిసొస్తుంది. ఏదో నాలుగు రాళ్లు విసిరి బయపెట్టేదామనుకున్న ప్లాన్ బెడిసికొట్టి రివర్స్ లో ఇప్పుడు వారికి తగులుతున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..? ఈమ‌ధ్య కుటుంబంతో స‌హా బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స్వామివారి ద‌ర్శ‌నార్ధం తిరుమ‌ల‌కు వచ్చారు. ద‌ర్శ‌నం త‌ర్వాత తిరుగు ప్ర‌యాణంలో ఉన్న‌పుడు అమిత్ షా కాన్వాయ్ పై హ‌టాత్తుగా స్థానిక టీడీపీ నాయకులు రాళ్లదాడికి దిగారు.

ఆ విషయాన్ని అప్పుడు పెద్దగా పట్టించుకోనట్టు కనిపించిన బీజేపీ అగ్ర నేతలు ఇప్పుడు ప్రతీకార చర్యలకు దిగారు. బీజేపీలో నరేంద్రమోదీ తరువాత స్థానంలో ఉన్న అమితాషా మీద దాడి అంటే సామాన్య విషయం కాదు అని టీడీపీ నేతలకు తెలిసొచ్చేలా యాక్టిన్ ప్లాన్ రెడీ చేసారు. అప్పుడు దాడిలో పాల్గొన్న వారందరికీ నోటీసులు ఇచ్చి కటకటాల్లో వెయ్యాలని జిల్లా పోలీసులకు కేంద్ర హోమ్ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రాంగ్ గా ఆదేశాలు అందాయట. ఇక సీరియస్ గా ఆ దాడిలో పాల్గొన్న వారందరిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇది స్థానిక టీడీపీ నాయకులకు మింగుడుపడడంలేదు.

ఈ దాడి వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో రెండురోజులపాటు నిరసన కార్యక్రమాలు చేశారు. దాడిలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదలొద్దని పోలీసులుకు పై నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మొన్న‌టి 11 వ తేదీన జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వీడియో సాక్ష్యాధారాల‌తో నేత‌ల‌ను గుర్తించారు. వీటితోపాటు టీవీ చాన‌ళ్ళ‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌తో పాటు దిన‌ప‌త్రికలో వ‌చ్చిన ఫొటోల‌నే సాక్ష్యాలుగా సేకరించారు పోలీసులు.

తిరుప‌తి టీడీపీ అధ్య‌క్షుడు దంపూరి భాస్క‌ర్ యాద‌వ్ గుణ‌శేఖ‌ర్ నాయుడు జిల్లా తెలుగుయువ‌త అధ్య‌క్షుడు శ్రీ‌ధ‌ర వర్మ తిరుప‌తి ఎంఎల్ఏ సుగుణ‌మ్మ అల్లుడు సంజ‌య్ త‌దిత‌రుల‌ను గుర్తించ‌ట‌మే కాకుండా వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ప‌లువురిని ఇప్ప‌టికే విచార‌ణ కోస‌మ‌ని పోలీసు స్టేష‌న్ కు పిలిపించారు కూడా. కాన్వాయ్ పై దాడి చేసిన సుబ్ర‌మ‌ణ్యం అనే కార్య‌క‌ర్త‌ను అదే రోజు అరెస్టు చేసి రిమాండ్ కు కూడా పంపిన విష‌యం తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

,