మంకీపాక్స్ పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..!!

గత మూడు సంవత్సరాల నుండి ప్రపంచాన్ని ఏదో ఒక వ్యాధి చుట్టూ ముడుతూ ఉంది.2019 నవంబర్ నెలలో కరోనా వైరస్ చైనా నుండి బయటపడటం ప్రపంచం మొత్తం వ్యాపించడం తెలిసిందే.ఈ వైరస్ నీ అరికట్టడానికి ప్రపంచ దేశాలు తీసుకున్న చాలా నిర్ణయాలు.ఆర్థికంగా ఇంకా అనేక రీతులుగా మనిషి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.ఇప్పటికీ కూడా కొన్నిచోట్ల కరోనా కొత్త వేరియంట్ లు బయటపడుతున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరో వ్యాధి మంకీపాక్స్ కూడా వేగంగా విస్తరిస్తూ ఉంది.

 Central Minister's Key Comments On Monkeypox,  Central Minister Mansukh Mandaviy-TeluguStop.com

యూరప్ దేశాలలో అనేక మంకీపాక్స్ కేసులు బయటపడటం ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి.

ఇటువంటి తరుణంలో మంకీపాక్స్ కేసులు ఇండియాలో కూడా పెరుగుతూ ఉండటంతో ఈ వ్యాధి గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియా రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

మంకీపాక్స్ కొత్త వైరస్ కాదని ఇండియాకి ఈ వ్యాధి గురించి ఎప్పుడో తెలుసు అని స్పష్టం చేశారు.కొన్ని దశాబ్దాల నుండి ఆఫ్రికాలో ఈ వ్యాధి ఉందని పేర్కొన్నారు.

భయంకరమైన కరోనా నీ ఎదుర్కోవటం జరిగిందని…మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మంకీపాక్స్ దేశంలో అదుపులోనే ఉందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube