రైతుల నాలుగు డిమాండ్లలో రెండు డిమాండ్ల ను అంగీకరించిన కేంద్రం

కేంద్ర మంత్రులతో 41 రైతు సంఘాల నేతలు డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సమావేశం అయ్యారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూస్ గోయల్, వాణిజ్య సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లు కీలక సభ్యులుగా ఉన్నారు.

 Central Ministers Discussions About Farmmars In Vignan Bhavan, Formers Protest I-TeluguStop.com

రైతులు మొత్తంగా నాలుగు డిమాండ్లను కేంద్ర మంత్రుల ముందు ఉంచారు.అందులో రెండు డిమాండ్లను కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా రైతు సంఘాల నేతలు తెలిపారు.

మొదటగా మూడు సాగు చట్టాలను రద్దు చెయ్యాలని రైతులు కేంద్ర మంత్రులకు వివరించారు.

అందుకు కేంద్ర మంత్రులు దానికి ప్రత్యామ్నాయాలుంటే తెలపాలని రైతులను కోరింది.

అయితే రైతులు మాత్రం మొదటి సారిగా ప్రత్యామ్నాయాలు అడుగుతుంది కావున కేంద్ర ప్రభుత్వమే చెప్పాలని కోరింది.అందుకు కేంద్ర మంత్రులు వాజ్ పేయ్ ప్రభుత్వం హయాంలో ఇలానే జరిగినప్పుడు ఆర్డినెన్స్ ద్వారా చట్టాలను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

రెండోవది రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో హామీ మాత్రం ఇవ్వలేము కానీ లికిత పూర్వక హామీ కల్పిస్తాం అన్నారు.రైతులపై పెట్టిన క్రిమినల్ కేస్ లను కొట్టివేయ్యాలని రైతులు కోరారు.

దిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కొత్తగా చట్టాలు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Telugu Delhi, Farmmars, Narendrasingh, Piyush Goyal, Vignan Bhavan-General-Telug

అయితే పంజాబ్, హరియాన లో ని రైతులు పంట వ్యర్థాలను కాల్చినప్పుడు వస్తున్న కాలుష్యంతో అక్కడి పోలీసు లు క్రిమినల్ కేసులు పెడుతున్నారని వెంటనే ఆ నిబందనలను తొలగించాలని రైతు నేతలు కోరారు.అందుకు కేంద్ర మంత్రులు అంగీకరించారు.నాలుగోవా డిమాండ్ గా విద్యుత్ సవరణ బిల్లు కానీ అమలు లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు నుండి అందుతున్న రాయితీలు రద్దు అయ్యే ప్రమాదం ఉన్నదని రైతులు వివరించారు.

Telugu Delhi, Farmmars, Narendrasingh, Piyush Goyal, Vignan Bhavan-General-Telug

దీనిపై కేంద్ర మంత్రులు రైతులకు రాయితీలు ఎప్పటిలాగే అందే విదంగా చూస్తాం అన్నారు.కానీ దీనిపై ఇంకా స్పష్టత మాత్రం మంత్రులు నుండి రాలేదు, రైతులు మాత్రం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకున్నట్లుగా చెబుతున్నారు.మొత్తంగా నాలుగు డిమాండ్స్ లో రెండు నెరవేరయని రైతులు చెబుతున్నారు.వచ్చే నెల జనవరి 4 న రైతు నేతల సంఘాలతో కేంద్రమంత్రులు మరో మారు సమావేశం కానున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube