వారిని అక్కడే కాల్చి పారేయాలన్న కేంద్ర మంత్రి

జాతీయ పౌరసత్వ బిల్లును ఈశాన్య రాష్ట్రల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి.

 Central Minister Suresh Angadi Comments On National Citizenship Bill-TeluguStop.com

ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున నష్టం చేస్తూ ఆందోళనలు సాగుతున్నాయి.ఇదే సమయంలో ఆందోళన కారులపై పోలీసుల లాఠీ చార్జీలు కూడా జరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి సురేష్‌ అగాండీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.ఆందోళన కారులను మరింతగా రెచ్చగొట్టే విధంగా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయి.

బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిపై ఆయన విమర్శలు గుప్పించాడు.ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్న వారిని అక్కడికక్కడే కాల్చి పారేయాలంటూ ఈయన పోలీసులకు సూచించాడు.ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం అంటే ప్రజల ఆస్తులను నాశనం చేయడం అని, ప్రజల ఆస్తులను నాశనం చేసే హక్కు వారికి ఎవరు ఇచ్చారంటూ మంత్రి ప్రశ్నించాడు.మంత్రి వ్యాఖ్యలు ఆందోళనకారులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, వారిని మరింతగా రెచ్చిపోయేలా చేస్తున్నాయంటూ విపక్ష పార్టీల వారు మండి పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube