కేంద్ర మంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు  

Central Minister Shocking Comments-jds,karnataka,sadananda Gowda,కర్ణాటక,కాంగ్రెస్

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోందని, రేపు సాయంత్రం వరకే కుమారస్వామి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారని కేంద్ర మంత్రి సదానందగౌడ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ సిద్దరామయ్య పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే..

కేంద్ర మంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు -Central Minister Shocking Comments

అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే సదానంద గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు సమయం ఆసన్నమైందని సదానంద గౌడ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే మరోపక్క రోషన్ బేగ్ చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకున్న అధిష్టానం బేగ్ పై మండిపడి ఇలాంటి వి మళ్లీ జరగకుండా చూడాలని వార్నింగ్ ఇచ్చింది.

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ జోకర్‌ అని రోషన్‌ బేగ్‌ తిట్టిపోసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే అత్యధిక సీట్లు దక్కుతాయంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో రోషన్‌ బేగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంకా ఆ వ్యాఖ్యలు మరువక ముందే సదానంద గౌడ రేఫు సాయంత్రం వరకే సి ఎం కుమారా స్వామి సి ఎం పోస్టు లో ఉంటారు అని వ్యాఖ్యలు చేయడం తో అక్కడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.