కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్!

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Corona Virus, Covid-19, Nitin Gadkari, Bjp-TeluguStop.com

గత 8 నెలలుగా కరోనా వైరస్ దారుణంగా విజృంబిస్తూ ప్రాణాలను తీస్తుంది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి.

ప్రజలను బంధీలను చేశాయ్.

ప్రస్తుతం మన దేశంలో ఆన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుంది.

ప్రజలను జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం చెప్తూనే ఉంది.ఇక ప్రజలు కూడా శానిటైజర్ ఉపయోగిస్తూ.

మాస్కులు ధరిస్తూ.సామజిక దూరం పాటిస్తున్నారు.

అయినప్పటికి ఎలాగోలా కరోనా వైరస్ సోకుతుంది.ఇక అలానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా కరోనా సోకింది.

కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా వైరస్ బారిన పడ్డారు.ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రజలకు వెల్లడించారు.

ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్టు ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.కాగా గత పది రోజుల్లో అతన్ని కలిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నితీన్ గడ్కరీ చెప్పారు.

అయితే అతను కాస్త బలిహీనంగా అనిపించడంతో ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించినట్టు, అందుకే కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నట్టు అప్పుడే వారికి కరోనా పాజిటివ్ తేలిందని ఆయన చెప్పారు.కాగా దేశంలో కరోనా వైరస్ ఎక్కువగా ప్రముఖులకే సోకుతుంది.

ఇప్పటికే ఏడుగురు మంత్రులు కరోనా బారిన పడగా మొత్తం 25 మంది ఎంపీలకు కరోనా వైరస్ సోకింది.

కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లమందికిపైగా పాజిటివ్ రాగ, అందులో రెండు కోట్ల 18 లక్షలమంది కరోనా నుంచి బయటపడ్డారు.9 లక్షల 45 వేలమందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.ఇక దేశంలోను 50 లక్షలమంది కరోనా బారిన పడ్డారు.

అందులో 40 లక్షలమంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా 80 వేలమంది కరోనా వైరస్ కు బలయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube