ప్రధాని నుండి రేపు మరో కీలక ప్రకటన

నేడు ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది.

 Another Announcement Tomorrow Comes From Indian Prime Minister Narendra Modi, In-TeluguStop.com

ఇప్పటికే పలు కంపెనీలు మూత పడ్డాయి.మరెన్ని కంపెనీలు జాడా పత్తా లేకుండా పోతాయో అని, దాంతో ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు లేకుండా పోతారో అంటూ విశ్లేషకులు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో కేంద్ర మంత్రి ప్రకాష్‌ జయదేకర్‌ ఆసక్తికర ప్రకటన చేశారు.

రేపు ప్రధాని నరేంద్ర మోడీ నుండి కీలక ప్రకటన రాబోతున్నట్లుగా ప్రకటించాడు.

ఏప్రిల్‌ 20వ తారీకు తర్వాత లాక్‌డౌన్‌ విషయమై రాష్ట్రాలతో చర్చించబోతున్నారు.

ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానుసారం కొన్ని రకాలుగా లాక్‌డౌన్‌లో సడలింపులు చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.మాస్టర్‌ ప్లాన్‌ను సిద్దం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ విషయంలో రేపు ఒక ప్రకటన చేస్తాడని మంత్రి పేర్కొన్నారు.

దాంతో ఆర్థిక పరమైన ప్రకటన అయ్యి ఉంటుందా అంటూ రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పేదలు తిండి కూడా లేకుండా అవస్థలు పడుతుండగా ఈ సమయంలో మోడీ నుండి ఆర్థిక ప్యాకేజీ తప్పనిసరి అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube