ఏపీ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కీలక మంత్రి..!!

దేశవ్యాప్తంగా గత ఏడాది వరదలకు అదేవిధంగా తుఫాను మరియు తెగులు వలన నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిధులు మంజూరు అయ్యాయి.దాదాపు ఐదు రాష్ట్రాలకు అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ హెచ్ఎల్ సి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద కేంద్ర అదనపు సహాయాన్ని ఆమోదించటం జరిగింది.

 Central Minister Good News Told To Andhra Pradeshys Jagan, Amith Shah, Bihar, An-TeluguStop.com

ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది.గత ఏడాది నైరుతి రుతుపవనాల వలన అకాల వర్షం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వరకు నష్టపోవడంతో రూ.280.76 కోట్లు ఇవ్వడానికి హెచ్‌ఎల్‌సీ ఆమోదించినట్లు పేర్కొంది.

ఇదే తరుణంలో ఖరీఫ్ సమయములో తెగులు కారణంగా నష్టపోయిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  రూ.1,280 కోట్లు కేటాయించింది.బిహార్‌కు రూ.1,255.27 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.ఇదిలా ఉంటే విపత్తు కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు చేయూత సాయం అందించడానికి కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన హెచ్‌ఎల్‌సీ అందిస్తున్న సహాయం లో ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా కేటాయించడం దక్షిణాది రాష్ట్రాలకు అతి తక్కువ నిధులు కేటాయించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube