ఆ అధికారులతో అమిత్ షా స్పెషల్ మీటింగ్ ! ? రాజకీయ సంచలనం..

దేశ రాజకీయాలపై ఎలా ఉన్నా.  తెలంగాణ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లుగా కనిపిస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

గత కొంతకాలంగా వరుస వరుసగా తెలంగాణలో పర్యటిస్తూ,  బిజెపి నాయకులలో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రతి సందర్భంలోనూ తెలంగాణ అధికార పార్టీని ఎదుర్కొనే విధంగా పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  కేంద్ర మంత్రులతో వరుసగా తెలంగాణ పర్యటనలు చేయిస్తూ,  తెలంగాణ బిజెపికి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వారోత్సవాలకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అలాగే తెలంగాణ బిజెపి కీలక నాయకులతోను ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తెలంగాణ రాజకీయాలతో పాటు , మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల అంశం పైన చర్చించారు.అయితే దీంతో పాటు తెలంగాణలోని వివిధ దర్యాప్తు సంస్థల కీలక అధికారులతో అమిత్ సమావేశం నిర్వహించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ లో అమిత్ షా ఈ సమావేశం నిర్వహించినట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తుంది.ఈ సమావేశంలో ఐటి, ఈడి , సిబిఐ సంస్థలకు చెందిన దక్షిణాది ఉన్నతాధికారులతో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో అమిత్ షా సమావేశం నిర్వహించారట.

Advertisement

హోం మంత్రి హోదాలో అమిత్ షా ఈ సమావేశం నిర్వహించినా.దీనికి వెనుక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.  ఇటీవల కాలంలో తెలంగాణలోని బిజెపి రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్ గా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి.

అనేక రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటు,  బడా బడా కంపెనీల పారిశ్రామికవేత్తల ఇళ్లల్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం బయటపడడం,  అందులో కేసీఆర్ కుమార్తె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేయడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని దాడులు టిఆర్ఎస్ నేతలే టార్గెట్ గా  చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు