దేశంలో పెరిగిన కేసులు లేటెస్ట్ కరోనా బులిటెన్..!!

దేశంలో చాలా రాష్ట్రాలలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.ఇలాంటి తరుణంలో మళ్లీ లాక్ డౌన్ చేపట్టే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి.

 Central Health Ministry Released The Latest Corona Health Bulletin With Increase-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్ విడుదల చేయగా కేసులు గతంలో కంటే పెరిగినట్టు తెలుస్తుంది.పూర్తి వివరాల్లోకి వెళితే దేశంలో గడచిన 24 గంటల్లో ఏకంగా 16,738 కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1,10,46,914 కు చేరింది.

ఇక ఇదే తరుణంలో గడిచిన 24 గంటల్లో 11,799 మహమ్మారి నుండి కోలుకోవటంతో 1,07,38,501 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన కేసుల తో కలిపి ప్రస్తుతం 1,51,708 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

వీరిలో కొంతమంది హాస్పిటల్ లో, మరి కొంతమంది ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.ఇక గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 138 మంది కరోనా వల్ల మృతి చెందటంతో.

మృతుల సంఖ్య 1,56,705కి చేరింది.

Telugu Corona, India-Latest News - Telugu .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube