జూన్ లో 12 కోట్ల వ్యాక్సిన్లు.. కేంద్ర ఆరోగ్య శాఖ..!

కరోనా కట్టడిలో భాగంగా అందరికి వ్యాక్సినేషన్ చేయించాలని కేంద్రం సూచించింది.మొన్నటి వరకు 45 ఏళ్లు పై బడిన వారికే వ్యాక్సిన్ చేయగా ఇప్పుడు రాష్ట్రాలకు 18 ప్లస్ ఉన్న అందరికి వ్యాక్సిన్ వేసే సౌలభ్యాన్ని కల్పించింది.

 Central Health Department Announced 12 Crores Vaccines Will Release In June Mont-TeluguStop.com

మొన్నటివరకు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వారికి సెకండ్ డోస్ వేశారు.అయితే ఇక ఇప్పుడు అందరికి మొదటి డోస్ వేస్తున్నారు.

దేశంలో ఇప్పటివరకు 21 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిచారు.మే నెలలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం 7.9 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను కేంద్రం ఏర్పాటు చేసింది.అయితే కొన్నిచోట్ల వ్యాక్సిన్ కొరత ఏర్పడుతున్న కారణంగా జూన్ నెలలో 12 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ.

అయితే వీటిలో 6.09 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా ఇస్తుండగా మరో 5.86 వ్యాక్సిన్ డోస్ లను రాష్ట్రాలు ప్రైవేట్ హాస్పిటల్స్ సేకరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.జనాభా, వ్యాక్సిన్ డోస్ ల వృధాని పరిగణలోకి తీసుకునే వ్యాక్సిన్ డోస్ లను అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తానికి జూన్ నెలలో దేశం మొత్తం మరో 12 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube