చంద్రబాబు ని ఢీ కొట్టడం ఎలా..? జుట్టు పీక్కుంటున్న కేంద్రం

చంద్రబాబు అరెస్ట్ తప్పని సరి ఇక చంద్రబాబు ని ఎవరూ కాపాడలేరు.త్వరలోనే చంద్రబాబు చిప్పకూడు తింటారు.

 Central Govt Thinking About Chandrababu Act In Ap-TeluguStop.com

ఎన్నో అవినీతి కేసుల్లో ఆయన ఉన్నారు.జైల్లో పెట్టించేస్తామని బీజేపి నేతలు అప్పట్లో తెగ హడావిడి చేశారు.

ఆ తరువాత కర్ణాటక ఎన్నికలు అవగానే బాబు కి మూడింది అంటూ ఫేక్ మీడియా లో ప్రచారం చేయించారు.ఎన్నికలు అవగానే రిజల్ట్స్ రాగానే అరెస్ట్ అన్నారు.

రిజల్స్ రాగానే త్వరలోనే ఉంటుంది అరెస్ట్ అన్నారు ఇలా తెలుగుదేశం కార్యకర్తలని నేతలని ఆందోళనకి గురిచేసి పార్టీలో అలజడి రేపి చంద్రబాబు ని మానసికంగా దెబ్బకొట్టాలని అనుకున్నారు.అయితే ఇప్పటి వరకూ అరెస్టు కాదు కదా చంద్రబాబు నీడని సైతం తాకలేక పోయారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు ని దెబ్బ కొట్టడానికి ప్రధాని మోడీ నే రంగంలోకి దిగుతున్నారు.దీనికి సంబంధించి ఒక ప్రముఖ వార్తా పత్రిక, ఒక సంచలన కధనం ప్రచురించింది…ఈ చంద్రబాబు ని ఎదుర్కోవడం ఎలా అనే కోణంలో బీజేపి పెద్దలు చర్చలు జరుపుతున్నరాట.ఈరోజు అంటే జూన్ 15 న ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం కానున్నారు.అయితే ఆ పత్రిక కధనం ప్రకారం.కన్నా లక్ష్మీ నారాయణ రెండు రోజుల క్రితం, ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే.అయితే కన్నాను ఆంధ్రప్రదేశ్ వెళ్ళకుండా ఢిల్లీలోనే మరో రెండు రోజులు ఉండాలని ఆదేశాలు వచ్చాయి.

కన్నా మాత్రమే కాదు ఈరోజు రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సైతం ఈ భేటీలో పాల్గొంటున్నారు.

ఈ కీలక భేటీలో కొంతమంది వైసీపి కీలక నేతలు కూడా పాల్గొనే అవకాసం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అ.అయితే ఈ భేటీలో గవర్నర్ పాత్రే కీలకం అని తెలుస్తోంది.ఇప్పటికే చంద్రబాబు పై లెక్కలేనన్ని రిపోర్ట్ లు గవర్నర్ సిద్దం చేసి ఉంచారట.ఈ అన్ని పరిస్థితులపై గవర్నర్ పీఎం కి రిపోర్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.చంద్రబాబు బీజేపీ పై చేస్తున్న ఎదురుదాడి, ధర్మ పోరాట దీక్షలు, ప్రజల పై వీటి ప్రభావం, చంద్రబాబు పై ప్రజలు మొగ్గతం, ఇవన్నీ గవర్నర్ నివేదిస్తారని ఆ కధనంలో చెప్పారు…

అంతేకాదు ఈ మీటింగ్ ముగిసి గవర్నర్ ని పంపిన తరువాత “పవన్, జగన్” లని ఒకే వేదికపై కలిపే భారీ స్కెచ్ కి వ్యూహరచన కూడా ఇదే మీటింగ్ లో డిసైడ్ చేయనున్నారని తెలుస్తోంది…వీరిద్దరితో కలిసి ఎక్కువగా ఎంపీ సీట్లు గెలవడం ఎలా అని ఆలోచన చేస్తున్నారట.ఏది ఏమైనా సరే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ని డీ కొట్టడానికి అవసరమైన కార్యాచరణం ఈ రోజు ఢిల్లీ లో జరగనుంది అనేది జాతీయ మీడియా కధనం.

మరి వ్యూహాలు రచించడం లో దిట్ట అయిన చంద్రబాబు కేంద్రం వేసే ఎత్తులకి పై ఎత్తులు ఎలా వేస్తారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube