చంద్రబాబు ను అరెస్టు చేసే అవకాశం ఉందా..?

చంద్రబాబు అరెస్టు తప్పదా.? అసలు అరెస్టు చేసే అవకాశం ఉందా.? ఈ ప్రశ్నలు అటు టీడీపి లో ఇటు వైసీపిలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే చంద్రబాబు చుట్టూ భారీ వ్యూహాన్ని మాత్రం రచిస్తున్నారని మాత్రం జరుగుతున్న పరిణామాల ద్వారా అర్థం అవుతోంది.

 Central Govt Plan For Chandrababu Arrest-TeluguStop.com

అయితే ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం ఆ మధ్య నేతలతో చెప్పడం తో కేంద్రం ఎదో వ్యూహాన్ని రచిస్తోందన్న విషయం మాత్రం పక్కాగా అర్థం అవుతోంది.అయితే చంద్రబాబు మాత్రం తనపై ఎలాంటి కేసులు ఎన్ని కేసులు వేసుకున్నా సరే ఎదుర్కోవడానికి సిద్దం అంటూ చెప్పడంతో అరెస్టు అనుమానాలకి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.

అయితే సీఎం చంద్రబాబు పై ఎన్ని కుట్రలు పన్నినా ఒక వేళ అరెస్టుల వరకూ వెళ్ళినా సరే అవన్నీ నీరు గారిపోతాయి అంటున్నారు.ఇలాంటి ఎన్నో కేసుల నుంచీ చంద్రబాబు అలవోకగా తప్పించుకుని క్లీన్ చీట్ తెప్పించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ధర్మ పోరాట దీక్ష, సభలు, సైకిల్ ర్యాలీలు తదితర సందర్భాల్లో ఈ అరెస్టుల ప్రస్తావన తెస్తున్నారు చంద్రబాబు ఎందుకంటే ఒక వేళ అరెస్టు గనుకా జరిగితే అది కేవలం ఏపీ కి పత్యేక హోదా కోసం నిరసనలు తెలుపుతున్నందుకే అంటూ చంద్రాబు ప్రజలకి వివరించడానికి అని అర్థం అవుతోంది.

ఇదిలాఉంటే మరో వైపు కర్నాటక ఎన్నికలు ఈ నెల12న జరగనున్నాయి.15న ఫలితాలు రానున్నాయి.ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే సిఎం చంద్రబాబుపై కేసులు వస్తాయనే ప్రచారం సాగుతోంది.

ఇందుకు బలం చేకూరుస్తున్నట్లుగా ఉన్నాయి పలువురు నేతల మాటలు.బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలు చాలా గట్టిగానే ఈ ఈ విషయాలని పదే పదే తెలుపుతున్నారు.

నరసింహన్ కూడా చంద్రబాబు ని ఇదే విషయంపై హెచ్చరించారని తెలుస్తోంది.అయితే ఎన్ని కుట్రలు జరిగినా నేను బయపడేది లేదు అంటూ చంద్రబాబు తేల్చి చెప్తున్నారు.

కేంద్రం కూడా పట్టిసీమ, పోలవరం, గోదావరి, కృష్ణా పుష్కరాలు, విభజన నిధుల వెచ్చింపు వంటి విషయాల్లో పూర్తిగా కూపీ లాగుతోంది…ఇప్పటికే రాష్ట్రానికి చెందినా కొన్ని కీలక విషయాలు ప్రాజెక్ట్ లకి సంభందించిన మరి కొన్ని కీలక విషయాలు కేంద్రానికి ఉప్పందించారని తెలుస్తోంది.వీలున్నంత వరకు చంద్రబాబును నిందితుడిగా చేర్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంకోవైపు ముద్రగడ తన లేఖలో సైతం చంద్రబాబు లోకేష్ ల అరెస్టు విషయం ప్రస్తావనకి తీసుకు వచ్చారు

చంద్రబాబు తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు సీబీఐ విచారణ జరిపించాలని కోరాడం లేదని.

సీబీఐ విచారణ కోరకపోతే చరిత్రహీనులు అవుతారని చెబుతున్నారు.ఒకవేళ మీ ఇద్దరు అరెస్టు అయితే స్టే తెచ్చుకోరాదని సవాల్ విసరడం ఆశ్చర్యంగానే ఉంది…ఏది ఏమినా సరే చంద్రబాబు అరెస్టు కి రంగం సిద్దం అవుతుందని అది మే 15 తరువాతనే ఉంటుందని చెప్పడం తీవ్రమైన కలకలం రేపుతోంది.

అయితే ఒకవేళ అరెస్టు అయితే దానిని తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో చంద్రబాబు ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేశారట.మరి ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube