కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొనడమే కాదు, మరెంతో మందిని రోడ్డుకు కూడా ఈడ్చింది.వ్యాపారాలు, ఉద్యోగులు, విద్యార్ధులు ఇలా ఎందరో ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు కూడా.
ముఖ్యంగా విదేశాలలో ఉండే ఎన్నారైలు వివిధ కారణాల వలన భారత్ లోని వారి వారి ప్రాంతాలకు వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయారు.అలా ఉండిపోయిన ఎంతో మంది ఉపాది కోల్పోగా, వ్యాపారాలు నష్టపోయారు, విద్యార్ధులు తమ విద్యా సంవత్సరం పై ఆందోళన చెందుతున్నారు.
అయితే కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో పలు దేశాలు భారత్ నుంచీ వచ్చే ప్రయానాలపై ఆంక్షలు సడలిస్తున్నాయి.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చింది.
విదేశాలకు వెళ్ళే ఎన్నారైలు ఎవరూ అధైర్య పడవద్దని ధైర్యం చెప్తోంది.కరోనా కారణంగా విదేశాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించింది.
భారత్ లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఎన్నో దేశాలు విమానాయాన సర్వీసులు ప్రారంభించాయి కాబట్టి మిగిలిన దేశాలు కూడా నిభందనలు సడలిస్తాయని ఆయా దేశాల విదేశాంగ శాఖలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు వెళ్ళాల్సిన భారతీయులను గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ఇదిలాఉంటే అమెరికా వంటి అగ్ర రాజ్యం ఇప్పటి వరకూ ఎలాంటి సడలింపుఇవ్వలేదు, భవిష్యత్తులో ఇస్తుందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్న తరుణంలో భారత్ లో ఉన్న ఎన్నారైలకు మరో ఆందోళన వచ్చి పడింది.ప్రస్తుతం అమెరికాలో డెల్టా వేరియంట్ విజ్రుంభిస్తున్న తరుణంలో అమెరికా వెళ్తే క్షేమమా కాదా అనే సందేహంలో కొందరు ఎన్నారైలు ఆలోచన చేస్తున్నారట.
ఏది ఏమైనా ఎన్నారైలు విదేశాలకు వెళ్ళాలంటే తప్పకుండా సాయం అందిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది.