ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం ఝలక్!

ఒకపక్క కరోనా తో దేశాలు అన్ని అతలాకుతలం అయిపోతున్నా ఈ కామర్స్ సంస్థలు మాత్రం తమ వ్యాపారాలన్నీ వృద్ధి చేసుకుంటూనే ఉన్నాయి.ఈ కరోనా తో కొద్దీ నెలలు ఈ సంస్థలు మూతపడినప్పటికీ ఆ తరువాత కొద్దీ కొద్దిగా తమ వ్యాపారాలను ప్రారంభించేశాయి.

 Central Government Issues Notices To Flipkart, Amazon For Not Showing Mandatory-TeluguStop.com

ఈ క్రమంలోనే జనాలను ఆకర్షితులను చేయడం కోసం పండుగల సీజన్ సమయంలో క్రేజీ ఆఫర్స్ అందించి మరింత సేల్స్ పెంచడానికి పధకాలు వేస్తుంది.అయితే ఈ ఫ్లిప్ కార్ట్,అమెజాన్ సంస్థలకు కేంద్రం ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

గ్రేట్ ఇండియా సెల్,బిగ్ బిలియన్ డేస్ వంటి పేర్లతో ప్రత్యేక సేల్స్ ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తూ తమ సేల్స్ ను పెంచుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కల్పించుకొని ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.కస్టమర్ల ను ఆకర్షించుకోవడం కోసం వెబ్ సైట్ లో ఒక వస్తువును అమ్ముతున్నప్పుడు ఆ వస్తువు ఏ దేశంలో తయారైంది అన్న తప్పనిసరి నిబంధనను ఈ రెండు సంస్థలు పట్టించుకోవడం లేదని కేంద్రం అభిప్రాయపడుతోంది.

ఈ క్రమంలో ఆ సంస్థల పనితీరుపై కేంద్ర సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది.ఈ రెండు సంస్థలకే కాకుండా మరికొన్ని ఇతర సంస్థలకు కూడా కేంద్ర సర్కార్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై,యాప్ లపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కొన్ని చైనా యాప్ లను భారత్ లో బ్యాన్ కూడా చేసింది కేంద్రం.

ఇలాంటి సమయంలో ఈ ఈ-కామర్స్ సంస్థలు ఇలాంటి సేల్స్ ను నిర్వహించి ఆ వస్తువు ఏ దేశంలో తయారైంది అన్న నిబంధనను కూడా మరచి ప్రవర్తిస్తుండడం పై కేంద్రం అసహనం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube