విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం.

ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే.దాదాపు మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

 Central Govt New Scheme Distributing Free Laptops To Students, Students, Free La-TeluguStop.com

కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఇప్పట్లో విద్యా సంస్థలు తెరుచుకునే అవకాశం కూడా లేదు.ఈ క్రమంలోనే ఆన్లైన్ విద్య కు ఎంతో ప్రాధాన్యత పెరిగింది అన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు డిజిటల్ విద్యకు సంబంధించి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం కీలకం గా మారిపోయింది.

ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు అందరికీ 15 వేల విలువచేసే సాంకేతిక పరికరాలను అందించేందుకు మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదన తీసుకొచ్చింది.

దీని కోసం వచ్చే ఐదేళ్ల కాలని 60 వేల కోట్లను కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సరికొత్త ప్రతిపాదనల్లో 36473 కోట్ల కేంద్రం వాటా ఉండగా.మిగిలిన రాష్ట్రాలు మిగతా మొత్తాన్ని భరించాల్సి వస్తుంది.ఈ పథకం ద్వారా నాలుగు కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది, ఈ క్రమంలోనే 1.5 కోట్ల మంది విద్యార్థులకు లాప్టాప్ లు అందించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube