వాట్సాప్, జూమ్ యాప్ లపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్..!

వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ వినియోగంపై కేంద్రం ప్రభుత్వ అధికారులకు సూచనలు చేసింది.ఇటువంటి యాప్ లలో ఎటువంటి కీలక సమాచారం పంపుకోవద్దని కేంద్రం ప్రభుత్వ అధికారులను కేంద్రం ఆదేశించింది.

 Central Govt New Guidelines For Whatsapp And Zoom Apps Details, Whatsapp, Zoom,-TeluguStop.com

ఈ యాప్స్ కి సంబంధించిన సర్వర్లు ఇతర దేశాల్లో ఉండడం వలన.ఏదైనా కీలక సమాచారం పంపితే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అధికారులకు హెచ్చరించింది.ప్రభుత్వ అధికారులు కేవలం ఈ-ఆఫీస్ అప్లికేషన్లనే వాడాలని తెలిపింది.అంతేకాక.మీటింగ్ లకు సంబంధించి గూగుల్ మీట్, జూమ్ లను వాడొద్దని.వాటి స్థానంలో NIC, C-DAC యాప్ లను వాడాలని సూచించింది.

రహస్య సమాచారం లీక్‌లను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి శాఖ కేంద్రం చెప్పిన ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం కోరింది.

సర్వర్లు ప్రయివేటు యాజమాన్యానికి సంబంధించినవి కావున.ఏదైనా ముఖ్యమైన పత్రాలను అధికారులు తమ మొబైల్ సెట్‌లలో స్టోర్ చేయకూడదని తెలిపారు.

కీలక సమాచారాన్ని ఏదైనా మొబైల్ ద్వారా ఏ ఇతర అధికారులతోనూ షేర్ చేయకూడదని కేంద్ర వర్గాలు చెప్పాయి.ఈ కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు, అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చేరవేయబడ్డాయి.

అంతేకాక.జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను మాట్లాడుకునే సమావేశంలో ఎవరూ కూడా స్మార్ట్ వాచ్‌లు కానీ.

ఫోన్లు కానీ వాడొద్దని అధికారులను కేంద్రం కోరింది.

Telugu Dac, Central, Google Meet, Nic Apps, Private Apps, Servers, Whatsapp, Zoo

ఇక మీటింగ్ లను కూడా ప్రైవేట్ యాప్స్ అయిన గూగుల్ మీట్ మరియు జూమ్ యాప్ లను వాడొద్దని కోరింది.వాటికి బదులుగా C-DAC, NIC రూపొందించిన యాప్ లను వాడాలని సూచించింది.వాటికి కూడా కచ్చితంగా పాస్వర్డ్ పెట్టుకోవాలని తెలిపింది.

చాట్ రూమ్, వెయిటింగ్ ఫెసిలిటీస్ యాక్సెస్ చేయాలంటే పాస్వర్డ్ తప్పనిసరని కేంద్రం ఉన్నతాధికారులకు చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube