కేంద్రం కీలక నిర్ణయం...లాక్ డౌన్ సమయం మరింత పొడిగింపు  

Central Government, Lockdown, Corona Effect, April 10th - Telugu April 10th, Central Government, Corona Effect, Lockdown

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో కూడా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 4 వందల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - Central Govt Lock Down Corona Effect

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను కూడా ప్రకటించింది.దేశవ్యాప్తంగా మొత్తం 72 జిల్లాలలో కూడా ఈ నెల 31 వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ ని ప్రకటించారు.

TeluguStop.com - కేంద్రం కీలక నిర్ణయం…లాక్ డౌన్ సమయం మరింత పొడిగింపు-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ లాక్ డౌన్ కి కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఏమాత్రం సహకరించకపోవడం తో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు,పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ని ప్రకటించాయి.

కానీ ఈ లాక్ డౌన్ కి ప్రజలు ఏమాత్రం సహకరించడం లేదు.ఎలాంటి పని లేకపోయినా ఎదో ఒక వంకతో బయటకు వస్తుండడం,చుట్టాల ఇళ్లకు వెళ్తుండడం వంటి చర్యలతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తుంది.

కరోనా ను నియంత్రించడానికి కేంద్రం ఈ లాక్ డౌన్ పీరియడ్ ను పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈనెల 31 వరకు అమలు కానున్న ఈ లాక్ డౌన్ పిరియడ్ మరో 10 రోజులు పొడిగించి ఏప్రిల్ 10 వరకు కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఏ చిన్న తేడా వచ్చినా సరే పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది.కాబట్టి ఇప్పుడు ప్రజలను పూర్తిగా కట్టడి చేయడానికి గాను ఎమర్జెన్సి ని ప్రకటించే యోచనలో మోడీ సర్కార్ ఉంది.ప్రజలు బయటకు వస్తే లాఠీ చార్జ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.మాట వినకపోతే మాత్రం అరెస్ట్ చేయడానికి జైల్లో పెట్టడానికి సిద్దమవుతుంది.అవసరం అనుకుంటే దీనిపై ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.

#Lockdown #Corona Effect #April 10th

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Central Govt Lock Down Corona Effect Related Telugu News,Photos/Pics,Images..