అమెజాన్ కి ఫైన్ వేసిన కేంద్రం.. ఎందుకంటే..?!  

ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాకు భారత దేశ కేంద్ర ప్రభుత్వం జరిమానాను వేసింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - Central Govt Fines Amazon Mandatory Info Products

అమెజాన్ సంస్థలో ఉత్పత్తులకు సంబంధించి ఆ సంస్థ ఇవ్వాల్సిన తప్పనిసరైన సమాచారాన్ని పొందుపరచకపోవడం కారణంతో జరిమానా విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.ఇందులో భాగంగానే ఏదైనా వస్తువు విక్రయించే సమయంలో ఆ వస్తువు ఏ దేశంలో తయారవుతున్నాయి అన్న వివరాలను కూడా అమెజాన్ తెలపకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఇదివరకు పండుగ పేరిట బిగ్ బిలియన్ డేస్ అంటూ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు నిర్వహించిన నేపథ్యంలో రెండు సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించడం పై ఒకింత కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.

TeluguStop.com - అమెజాన్ కి ఫైన్ వేసిన కేంద్రం.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగానే వారి వెబ్ సైట్స్ లో ఉన్న వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో అందుకు సంబంధించి పూర్తి వివరాలు నచ్చకపోవడం పై తాజాగా కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కాస్త సీరియస్ గా వ్యవహరించింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను వెంటనే ఇవ్వాలని అమెజాన్ ,ఫ్లిప్కార్ట్ సంస్థలకు నోటీసులు జారీ చేయగా అందుకు ఇరు సంస్థలు వివరణ ఇచ్చాయి.ముందుగా సంస్థలకు అందజేసిన నోటీసులపై 15 రోజులలోపు సమాధానం ఇచ్చేందుకు సమయం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఇరు సంస్థలు ఇచ్చిన వివరాలలో భాగంగా అమెజాన్ సంస్థ ఇచ్చిన వివరాలు సంతృప్తికరంగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ జరిమానా విధించింది.భారతదేశ చట్ట ప్రకారం మొట్టమొదటిసారిగా జరిగిన తప్పిదానికి గాను అమెజాన్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం 25 వేల రూపాయల జరిమానను విధించినట్లు కేంద్ర ప్రభుత్వ తెలియజేశారు.ఇక మరో సంస్థ ఫ్లిప్కార్ట్ ఇచ్చిన సమాధానం తో సంతృప్తి పడిన కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థపై ఎటువంటి జరిమానా విధించలేదు.ఇదే తప్పు మరోసారి జరిగితే ఈసారి 50 వేల రూపాయల భారీ జరిమానా వేయడం జరుగుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

అలాగే మరికొన్ని సార్లు జరిగితే చివరికి జైలు శిక్ష విధించే అవకాశం లేకపోలేదన్నట్టు కూడా హెచ్చరించారు.

#Notice #Fine #Flipkat #Amazon #Customers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు