కువైట్ లోని ప్రవాస విద్యార్ధుల కోసం..కేంద్రం కీలక నిర్ణయం..!!

నేషనల్ ఎబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్ ) కోసం ఎంతో మంది విద్యార్ధులు పోటీ పడుతూ ఉంటారు.కేవలం భారత దేశంలో ఉండే విద్యార్ధులు మాత్రమే కాదు విదేశాలలో ఉన్న భారత విద్యార్ధులు సైతం ఈ పోటీ పరీక్షల కోసం ఏళ్ళ తరబడి తర్ఫీదు పొందుతారు.

 Central Govt Decision Neet Exam Center In Kuwait , Kuwait, Neat Exams, Indian-TeluguStop.com

అలాంటి నీట్ పరీక్షల విషయంలో కువైట్ లోని ప్రవాస విద్యార్ధులకు కేంద్ర గుడ్ న్యూస్ తెలిపింది.కువైట్ వ్యాప్తంగా ఎంతో మంది భారత విద్యార్ధులు నీట్ పరీక్షలకు ప్రతీ ఏటా పోటీ పడుతూ ఉంటారు.

ఈ క్రమంలో కువైట్ లోని భారత విద్యార్ధులు ప్రతీ ఏటా భారత్ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయబడిన పరీక్ష కేంద్రాలలో పరీక్షలు రాయాల్సి ఉంటోంది.

అయితే కరోన నిభంధనల నేపధ్యంలోనో లేదా కువైట్ నుంచీ ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు వస్తున్నారనే ఆలోచనతోనో భారత ప్రభుత్వం వారు ఎవరూ భారత్ వచ్చి నీట్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కువైట్ లోనే నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

కేంద్రం చేసిన ఈ ప్రకటనతో కువైట్ లోని భారతీయ విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Telugu Ambassadorsiby, Centralneet, Indianembassy, Indian Kuwait, Kuwait, Nation

భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనకు అనుగుణంగానే అక్కడి భారత ఎంబసీ వర్చువల్ విధానంలో నీట్ డే ను ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో కువైట్ లోని భారత రాయబారి సిబీ జార్జ్ మాట్లాడుతూ ప్రవాసుల సంక్షేమం విషయంలో మన భారత ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని, నీట్ పరీక్ష కేంద్రాన్ని కువైట్ లో ఏర్పాటు చేయాలనుకోవడం అందుకు నిదర్శనమని తెలిపారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది విద్యార్ధులకు వారి తల్లి తండ్రులకు సంతోషాన్ని ఇచ్చిందని, కువైట్ లోని ప్రవాస భారతీయులు భారత ప్రభుత్వానికి ఋణమని ఉంటామని భారత సంఘాలు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube