పవన్ కు కేంద్రం వార్నింగ్ ? అందుకే ఆ విషయంలో ?

గతంతో పోల్చుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు బాగా తగ్గింది.ముఖ్యంగా బిజెపితో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి పవన్ స్వతంత్రంగా ఏ విషయంలోనూ వ్యవహరించ లేకపోతున్నారు.

 Pawan Kalyan, Janasena, Lg Polymers Issue,bjp, Jagan Govt, Corona, Central Govt,-TeluguStop.com

గతంలో టిడిపితో కలిసి ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ హడావుడి చేస్తూ ఉండేవారు పవన్.అయితే అప్పట్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు.

ఏపీలో రాజకీయంగా ముందుకు వెళ్లాలంటే, ఖచ్చితంగా బిజెపి కేంద్ర పెద్దల అనుమతి కావాల్సి రావడం, వారు వైసీపీ ప్రభుత్వం తో సన్నిహితంగా ఉంటూ జగన్ నిర్ణయాలకు మద్దతు ఇస్తూ ఉండడం వంటి కారణాలతో జగన్ రాజకీయ విమర్శలు చేసే అవకాశం లేకుండా పోయింది.తాజాగా విశాఖలో ఎల్ జి పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీక్ అవ్వడం, సుమారు 12 మంది వరకు మరణించడం, మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ నానా హడావుడి చేస్తోంది.అంతేకాకుండా ఈ ఘటనపై సొంతంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో విచారణ కమిటీని కూడా నియమించింది.

ఏపీ ప్రభుత్వం ఎల్జీ కంపెనీ తో కుమ్మక్కైందని, జగన్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనీ, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ హడావుడి చేసింది.అయితే ఈ విషయంలో పవన్ కాస్త ఆలస్యంగా స్పందించారు.

అయితే ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, కేవలం పై పై విమర్శలకే పరిమితమయ్యారు.ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం ఉద్దేశించి కూడా పవన్ కొన్ని విమర్శలు చేశారు.

కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో టిడిపి నాయకులు అక్కడికి వెళ్లి ఆందోళన చేయడం సరికాదంటూ, విమర్శించారు అయితే ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పెద్దగా పవన్ స్పందించలేదు దీనికి కారణం కేంద్రం నుంచి పవన్ కు వార్నింగులు రావడమే కారణమట.ప్రస్తుతం ఎల్జీ కంపెనీ వ్యవహారం కేంద్రం డీల్ చేస్తాం ఈ క్రమంలో అటు ప్రభుత్వానికి ఇటు కంపెనీని విమర్శిస్తే ఈ వ్యవహారంలో చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే.

Telugu Central Pawan, Central, Corona, Jagan, Janasena, Lg Polymers, Pawan Kalya

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సదరు కంపెనీకి భూములు నీరు విద్యుత్ వంటి సౌకర్యాలు మాత్రమే అందించి పన్నులు కట్టించుకుంటోంది.ఇక మిగిలిన అనుమతులన్నీ కేంద్రం తీస్తోంది ఈ పరిస్థితుల్లో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ఈ విషయం పై విమర్శలు చేస్తే అది చివరికి తమ మెడకే చుట్టుకుంటుందని భావించిన బీజేపీ పెద్దలు, ఈ మేరకు ఈ వ్యవహారంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని పవన్ ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.అందుకే పవన్ ఎల్ జి పాలిమర్ కంపెనీ వ్యవహారంలో పార్టీ శ్రేణులు ఎవరు జోక్యం చేసుకోవద్దు అంటూ ప్రకటన సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే.లాక్ డౌన్ పూర్తయిన తరువాత పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడతాం అని చెబుతున్న పవన్, ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube