బాబుకి మూడిందట ! కేంద్రం పంతం ఇదేనట !  

Central Government Want To Put Chandrababu Naidu In To Trouble-

ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు . ప్రత్యేకహోదా పేరుతో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని , ఏపీ అభివృద్ధి చెందడం మోదీకి ఇష్టం లేదని … అందుకే ప్రతి విషయాన్నీ రాజకీయ కోణం లో చూస్తూ… కేంద్రం సహకరించడం లేదని ప్రచారం చేయడం, మోదీ కంటే నేనే సీనియర్ అంటూ నేను తలుచుకుంటే మోదీ ఎంత అంటూ గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ తీవ్రంగా పరిగణించి బాబు ని ఉక్కిరిబిక్కిరి చేయాలని మోదీ అండ్ కో బ్యాచ్ డిసైడ్ అయ్యింది.

Central Government Want To Put Chandrababu Naidu In Trouble-

Central Government Want To Put Chandrababu Naidu In To Trouble

ఎవర్నైనా వదిలిపెడతాం కానీ బాబు ని మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నట్టు కేంద్రం బాబుకు ఇప్పుడు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతోంది. కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలపై ఐటీ దాడులు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబుకు బినామీ అనే ఆరోపనలు ఎదుర్కొంటున్న సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు చేయడంతో బాబు అండ్ కో వణికిపోతున్నారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనట అసలు సినిమా ముందు ముందు చూపిస్తాం అన్నట్టు ఇప్పడు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

Central Government Want To Put Chandrababu Naidu In Trouble-

పోలవరం ప్రాజెక్టు, రాజధాని ఒప్పందాలు, భూసేకరణలో జరిగిన అవినీతి, తాత్కాలిక నిర్మాణాల పేరుతో జరిగిన దోపిడీ, రుణమాఫీ పథకాల్లో లొసుగులు, అమరావతి బాండ్లు ఒకటేంటి, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి బండారాన్నంతా బయట పెట్టేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. మొదటి నుంచి బాబు ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిందని విపక్షాలు కోడై కూస్తున్నాయి. బీజేపీ, టీడీపీ కలసి ఉన్నంత కాలం సైలెంట్‌గా ఉన్న కేంద్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు. ముందు ముందు ఏపీలో టీడీపీ నాయకులపై కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.