కరోనా కట్టడి చేయడం కోసం కేంద్రం కీలక నిర్ణయం..!!

ప్రపంచంలో రోజూ 7 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.వాటిలో మూడు లక్షలు ఇండియాలోనే నమోదవుతున్నాయి.

 Central Government To Use Army For Controlling Corona Cases , Rajnath Singh, Cor-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి దేశంలో దారుణంగా ఉంది.ఒక్క ఇండియాలో మాత్రమే గాక బ్రెజిల్, ఫ్రాన్స్  దేశాలలో కూడా కరోనా విలయతాండవం చేస్తుంది.

ఇలాంటి తరుణంలో మన దేశంలో కరోనా కంట్రోల్ చేయడానికి వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా.వేగవంతంగా కేంద్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే కరోనా కట్టడి కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.మేటర్  లోకి వెళ్తే .కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆర్మీ ని రంగంలోకి దింపడానికి ఆలోచనలు చేస్తూ ఉంది.ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ నర్వానేతో ఫోన్ లో మంతనాలు జరపటం జరిగిందట.

చాలా మంది యువత కరోనా లెక్కచేయకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండటంతో.అలాంటి ఆకతాయిల పని పట్టాలని కేంద్రం ఆర్మీ బలగాలను దించి యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 మరోపక్క మే ఫస్ట్ నుండి 18 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చని కేంద్రం తాజాగా వెసులుబాటు కల్పించడం జరిగింది.ఈ విధంగా ఒకపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా చేస్తూ మరో పక్క ఆకతాయిల ను అరికట్టే విధంగా కేంద్రం ముందడుగు వేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube