లాక్‌డౌన్ 5.0.. ఇది కన్ఫం!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

 Central Government To Implement Lockdown 5.0 From June 1, Lockdown, Lockdown 5.0-TeluguStop.com

కాగా ఈ మహమ్మారి నుండి భారత ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.దాదాపు రెండు నెలలకుపైగా నాలుగు దశలుగా ఈ లాక్‌డౌన్‌ను ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే మే 31న నాలుగో దశ లాక్‌డౌన్ ముగుస్తుండటంతో, ఆ తరువాత ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? అనే ప్రశ్న ప్రతిఒక్కరిలో నెలకొంది.అయితే కేంద్రం నుండి అందుతున్న సంకేతాల ప్రకారం మే 31 తరువాత 5వ దశ లాక్‌డౌన్ అమలులోకి రానున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం ప్రస్తుత పరిస్థితుల గురించి విచారించగా, లాక్‌డౌన్ మరికొద్ది రోజులు పొడిగించడమే శ్రేయస్కరం అని పలు రాష్ట్రాల సీఎంలు అన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, జూన్ 1వ తేదీ నుండి 5వ దశ లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.4వ దశ పూర్తవ్వగానే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలని తొలుత కేంద్రం భావించింది.కానీ రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయాందోళనను కలిగిస్తుండటంతో, కనీసం మరో రెండు వారాలైనా లాక్‌డౌన్ విధించాలని కేంద్ర యోచిస్తుంది.

ఈ మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలకు కేంద్రం వర్తమానం కూడా పంపిందట.మరి జూన్ 1వ తేదీ నుండి లాక్‌డౌన్ 5.0 కోసం ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ప్రజలు ఎంత మేర సిద్ధంగా ఉన్నారనేది తెలియాల్సిన విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube