నష్టం అంచనా వేసేందుకు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్న కేంద్ర బృందం

భాగ్యనగరం హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.అయితే నగరం పై కోలుకోలేని దెబ్బ పడింది అని గత కొన్నేళ్లుగా ఎన్నడూ చూడని వర్షాలు కురవడం తో భాగ్యనగరం వరదలతో ముంచెత్తింది.ఈ నేపథ్యంలో తెలంగాణా సీఎం కేసీఆర్ ఆర్ధికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని తక్షణ సాయంగా రూ.1350 కోట్లు అందించాలి అంటూ కేంద్రానికి ఇటీవల లేఖ కూడా రాశారు.ఈ క్రమంలోనే అక్కడ చోటుచేసుకున్న నష్టం పై ఒక అంచనా కు వచ్చేందుకు కేంద్ర బృందం నగరానికి రానున్నట్లు సమాచారం.హైదరాబాద్ లో వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు ఈ బృందం హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది.

 Central Government Team To Visit Hyderabad Flood Affected Areas , Hyderabad Floo-TeluguStop.com

రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృంద సభ్యులు పర్యటించి, భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది.మరోవైపు హైదరాబాద్ వరద బాధితుల ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది.ఇందుకోసం సీఎం సహాయనిధి నుంచి రూ.550కోట్లు కేటాయించి మరీ వరద బాధితులకు సాయం అందిస్తున్నారు.అలానే తెలంగాణ లో చోటుచేసుకున్న భారీ నష్టం పై అటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, అలానే టాలీవుడ్ ప్రముఖులు తమ వంతు సాయంగా సీఎం సహాయనిధి కి ఫండ్స్ ను అందించారు.తమిళనాడు సర్కార్ రూ.10 కోట్లు సాయం అందించగా, ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ రూ.15 కోట్ల సాయం అందించింది.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్ కూడా తమ వంతు సాయంగా రూ.2 కోట్లు ప్రకటించింది.

ఇతర రాష్ట్రాల తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీ లు కూడా సీఎం సహాయనిధి కి ఫండ్స్ ను డొనేట్ చేశారు.

అలానే ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.లక్ష సాయం, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం తెలంగాణా సర్కార్ అందించనుంది.అధికారులు బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే ఆధార్‌, రేషన్‌ కార్డుల వివరాలను కూడా నమోదు చేసి, డూప్లికేషన్‌కు తావు లేకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను కోరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube