సోషల్ మీడియాకు కేంద్రం వార్నింగ్... ఆ కంటెంట్‌ తొలగించాల్సిందే!

కేంద్రం సోషల్ మీడియాకు ఝలక్ ఇవ్వబోతోంది.ఇకపై ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్‌ సహా మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వారు అప్రమత్తంగా ఉండాల్సిందే.

 Central Government Strict Rules Against Social Media On Flagged Content Details,-TeluguStop.com

కేంద్రం చెప్పిన, అభ్యంతరకరమైన కంటెంట్ ఏదైనా ఉంటే వెంటనే దాన్ని డిలీట్ చేసేలా ఐటీ చట్టంలో సవరణలు చేస్తున్నట్టు సమాచారం.ఇక గతంలో కేంద్ర ఐటి మంత్రిత్వశాఖ ఇందుకోసం ఓ ముసాయిదాను సిద్ధం చేసిన సంగతి తెలిసినదే.

దీని కోసం డేటాను స్థానికీకరించాలని, భారతదేశంలో ఒక సంస్థగా ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని కంపెనీలకు సూచిస్తోంది.

రానున్న కొత్త చట్టం ప్రకారం, సోషల్ మీడియాలో ఏకపక్ష వైఖరి పనిచేయదు.

సోషల్ మీడియా నిరంతరం ఏ రకమైన పోస్ట్‌లను ఉంచవచ్చో.హెచ్చరిక ఉన్నప్పటికీ, కంపెనీలు వారి మాటలను వినట్లేదు, ఈ క్రమంలోనే కేంద్రం సోషల్ మీడియా కంపెనీలపట్ల గుర్రుగా వుంది.

అనేక విషయాలను వారు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది కేంద్రం.అదేభ్యంతరం వున్న పోస్టులను ప్రభుత్వం ఆదేశిస్తే 24 గంటల్లో తొలగించాలి.

లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి.ఇటీవల రైతు ఉద్యమం నేపధ్యంలో.

కొన్ని హ్యాష్ ట్యాగ్‌లను వాడకుండా నియంత్రించాలని ట్విట్టర్‌ను కేంద్రం కోరగా.ట్విట్టర్ పట్టించుకోని విషయం తెలిసినదే.

Telugu Central, Flagged, Strict-Latest News - Telugu

తాజా నిబంధనలతో అలాంటి పప్పులు ఇక ఉడకవు.అనవసర కంటెంట్‌ను “ఫ్లాగ్డ్‌”గా పిలుస్తారు.ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోనుంది.అంతే కాకుండా, ఇంటర్మీడియరీ స్టేటస్‌లో భాగంగా.ఆయా సంస్థలకు లభించే రక్షణను కూడా కోల్పోక తప్పదని సమాచారం.అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అంతకుముందు, వాట్సాప్ గోప్యతా విధానంలో, వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునే విషయం కూడా తీవ్ర విమర్శలకు కారణం అయ్యిందనే సంగతి తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube