ఈ పథకం ద్వారా రూ.20 వేలు పొందండిలా...!

వీధి వ్యాపారులు, చిన్న వర్తకుల కోసం పీఎం స్వనిధి స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రుణ పథకాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.కరోనా తర్వాత వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది.

 Central Government, Latest News, Pm Modi New Schme,latest News-TeluguStop.com

పూట గడవడమే కష్టమైపోయిన నేపథ్యంలో వారికి అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు రూ.10 వేల లోన్‌ను అందించేందుకు పీఎం స్వనిధి పథకానికి శ్రీకారం చుట్టింది.అయితే రుణం తీసుకున్న వ్యాపారులు ఒక ఏడాదిలోగా నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ముందస్తుగానే రుణం తీర్చేస్తే వడ్డీలో రాయితీ కూడా లభిస్తుంది.ఈ నగదు ప్రతి మూడు నెలలకు ఒకసారి రుణం తీసుకున్న వ్యాపారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

రుణ మొత్తాన్ని ఏడాదికంటే ముందస్తుగానే చెల్లిస్తే.మళ్లీ రుణం తీసుకోవచ్చు.

అయితే ఈ రోజుల్లో పదివేలతో వ్యాపారాన్ని బలోపేతం చేయాలన్నా.కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా కష్టమైపోతోంది.ఈ నేపథ్యంలో రుణ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి రూ.20 వేల లోన్‌ను అందించడం ప్రారంభించింది.ఇప్పుడు వ్యాపారస్తులు రూ.10000 లేదా రూ.20 వేల రుణం తీసుకోవచ్చు.వీధి వ్యాపారులు సమీపంలోని నెట్ సెంటర్లోకి వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

లేదా ఆన్ లైన్ లోనే పీఎం స్వనిధివెబ్‌సైట్‌కువెళ్లి రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుని.వ్యాపారానికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు పీఎం స్వనిధి రుణాలు అందిస్తున్నాయి.

Telugu Central, Latest, Pm Modi Schme-Latest News - Telugu

2022, మార్చి 31 లోగా ఈ పథకం ద్వారా రుణం పొందొచ్చు.2020 మార్చి 24 లేదా అంతకు ముందు ఎలాంటి రుణాలు కూడా పెండింగ్‌ ఉండకూడని వీధి వ్యాపారులు మాత్రమే లోన్ తీసుకునేందుకు అర్హులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube