బర్డ్ ప్లూ పై కేంద్రం తాజా ప్రకటన.. ఏం చెప్పిందంటే.. ?

కరోనా తగ్గుతుంది హమ్మయ్య అని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ‘బర్డ్​ ఫ్లూ’ వచ్చిపడింది.కోవిడ్ దెబ్బకు కోళ్ల పరిశ్రమలు కుదేలులై మెల్లగా కోలుకుంటున్న సమయంలో ‘బర్డ్​ ఫ్లూ’ తో కధ మళ్లీ మొదటికి వస్తుంది.

 Central Government, Latest Announcement, Bird Flu, Extended To 11 States-TeluguStop.com

ఇప్పటికే చికెన్ ధరలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి.ఇలాంటి సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది.

ఇకపోతే కేంద్రం తాజాగా చేసిన ప్రకటనలో దేశంలో 11 రాష్ట్రాలకు ‘బర్డ్​ ఫ్లూ’ విస్తరించినట్లు పేర్కొంది.

తాజాగా ఛత్తీస్​గఢ్​లో ఇన్​ఫ్లూయెంజా వ్యాప్తి చెందినట్లు తెలియచేసింది.

ఛత్తీస్​గఢ్​లోని జీఎస్​ పౌల్ట్రీ ఫామ్​లో బర్డ్​ఫ్లూ విస్తరించినట్లు తమ పరీక్షల్లో తేలిందని కేంద్ర పాడి పశు సంవర్థక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

కాగా ఈ రాష్ట్రానికి ‘బర్డ్​ ఫ్లూ’ రావడానికంటే ముందు దిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తర్​ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్​లలో బర్డ్ ​ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించింది.

మధ్యప్రదేశ్​లోని హర్దా, బర్హాన్​పుర్, రాజ్​గఢ్, దిందోరి, ఛింద్వాడా, మండ్ల, ధార్, సాగర్, సత్నా జిల్లాల్లోని నెమళ్లు, కాకుల్లో కూడా బర్డ్​ఫ్లూ విస్తరించినట్లు స్పష్టం చేసింది.అంతే కాకుండా బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube