కీలక ఘట్టానికి తెర లేచిన ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ.. !

ఇప్పటికే దేశంలో ఉన్న పలు సంస్దలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కేంద్రం ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణలో కీలక ఘట్టానికి తెర లేపింది.

 Central Government Has Taken A Key Decision In Privatization Of Air India , Air-TeluguStop.com

ఇందులో భాగంగా ఎయిర్‌ ఇండియా లో 100 శాతం వాటా విక్రయం కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది.కాగా కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నదట.

ఇకపోతే గతేడాది డిసెంబర్‌లో జరిగిన ప్రాథమిక బిడ్ల ప్రక్రియలో టాటా గ్రూప్‌ తో సహా పలు సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి.వీటిని పరిశీలించిన తర్వాత అర్హులైన పెట్టుబడిదారుల సందేహాలను వర్చువల్‌ పద్ధతిలో తీరుస్తామని కేంద్రం తెలియచేస్తుంది.

కాగా దీన్ని కొనుక్కునే సంస్థకు 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్‌, పార్కింగ్‌ స్లాట్‌లు లభిస్తాయి.విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్లు దక్కుతాయి.2017లోనే ఎయిర్‌ ఇండియా విక్రయ ప్రక్రియ ప్రారంభమైనా ఆ సంస్థకున్న రూ.60,074 కోట్ల అప్పులను పూర్తిగా భరించాలన్న నిబంధన కారణంగా ఏ కంపెనీ ముందుకు రాలేదు.

ఇక ఎయిర్‌ ఇండియా ను 2007లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేసినప్పటి నుంచి నష్టాలు వస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఏయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం వెల్లడిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube