మీరు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వాడుతారా? అయితే కేంద్రం ఓ శుభవార్త అందించింది!

అవును, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వినియోగదారులకు భారత ప్రభుత్వం ఓ శుభవార్త అందించింది.అదేమంటే ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు కేంద్రం కొత్త రూల్స్ తీసుకువస్తోంది.

 Central Government Good News For Facebook Twitter Users Details, Facebook, Socia-TeluguStop.com

ఆన్‌లైన్‌లోనే ఫేస్ బుక్, ట్విట్టర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తోంది.ఈ మేరకు కేంద్రం ఇటీవలనే GAC (గ్రీవెన్స్ అప్పిలెట్ కమిటీ)లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

దీని కోసం కేంద్రం కొత్త పోర్టల్ ఒకదానిని లాంచ్ చేయనుంది.

Telugu Central, Key, Latest, Platms, Ups-Latest News - Telugu

గత ఏడాది స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి అయినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గత ఏడాది జీఏసీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే.నేడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్నారనేది సుస్పష్టం.అయితే ఆ ప్లాట్‌పామ్ కంపెనీలు మాత్రం యూజర్ల సమస్యలు తీర్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం బాధాకరం అని ఆయన తెలిపారు.

ఈ ప్లాట్‌ఫామ్స్ కేవలం పేరుకు మాత్రమే గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తున్నాయని పేర్కొన్నారు.

Telugu Central, Key, Latest, Platms, Ups-Latest News - Telugu

యూజర్ల సమస్యలకు ఆన్‌లైన్ కంపెనీల నుంచి సరైన రెస్పాన్స్ పొందలేకపోతే వారు GAC ద్వారా కేంద్రానికి నేరుగా ఫిర్యాదు చేయొచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కమిటీలు పూర్తిగా వర్చువల్ ఆధారంగా పనిచేస్తాయని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.ఇంట్లో నుంచే మీరు మీమీ సమస్యలు వారికి వెల్లడించొచ్చు.

కమిటీలు యూజర్ల ఫిర్యాదుకు 30 రోజుల్లోగా స్పందిస్తాయని ఆయన తెలిపారు.రానున్న వారాల్లో ఈ పోర్టల్ యాక్టివేట్ అవుతుందని, ప్రస్తుతం ఇంకా ఈ పోర్టల్ అందుబాటులోకి రాలేదని కూడా అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube