మొదట మల్టీ ప్లెక్స్‌ లకు.. ఆ తర్వాత థియేటర్లకు

కరోనా కారణంగా ఇండియాలో గత ఆరు ఏడు నెలలుగా థియేటర్లలో బొమ్మ పడలేదు.ఆగస్టు నుండి అదుగో ఇదుగో అనుమతులు అంటూ అంతా కూడా ఎదురు చూస్తున్నారు.

 Central Government Going To Unlock Theaters Very Soon-TeluguStop.com

థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌లు భారీ ఎత్తున నష్టాల పాలు అవుతున్నారు.సెప్టెంబర్‌లో అయినా థియేటర్లకు మోక్షం దక్కుతుందేమో అనుకుంటే మళ్లీ నిరాశే మిగిలింది.

దాదాపు అన్ని చోట్ల కూడా అన్‌ లాక్‌ వాతావరణం కనిపిస్తుంది.కాని కేవలం థియేటర్ల వద్ద మాత్రం లాక్‌ ఉంది.

ఇందువల్ల ప్రభుత్వాన్ని థియేటర్ల యాజమాన్యాలు మరియు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఇప్పటికే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.ఈ సమయంలో థియేటర్లు ఓపెన్‌ చేసినా కూడా పెద్దగా నష్టం ఏమీ లేదని కొందరు భావిస్తున్నారు.

ముఖ్యంగా ప్రజల్లో పూర్తిగా అవగాహణ వచ్చింది.ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి.

ఇండియాలో మాత్రం ఎందుకు ఓపెన్‌ చేయకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో థియేటర్లపై ఉన్న ఆంక్షలను మెల్లగా తొలగించేందుకు సిద్దం అవుతున్నారు.

ఇప్పటికే థియేటర్ల మరియు మల్టీప్లెక్స్‌లకు విడివిడిగా అన్‌ లాక్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చారట.అక్టోబర్‌ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 500 మల్టీప్లెక్స్‌ లకు అనుమతులు ఇవ్వబోతున్నారు.

ఆ తర్వాత విడుతలో మిగిలిన వాటిని ఓపెన్‌ చేసేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని అంటున్నారు.అతి త్వరలోనే అందుకు సంబంధించిన మార్గ దర్శకాలు విడుదల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

భారీ ఎత్తున నష్టపోయిన థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలను ఆదుకనేందుకు ప్రభుత్వం పన్నులు మినహాయింపు ఇవ్వడంతో పాటు కరెంట్‌ బిల్లులను ఎత్తి వేయాలంటూ విజ్ఞప్తి చేశారు.థియేటర్లు ప్రారంభం అయిన తర్వాత కూడా కనీసం మూడు నాలుగు నెలల పాటు పన్ను మినహాయింపు మరియు కరెంట్ బిల్లలు ఉండవద్దని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube