ఆ యూట్యూబ్ ఛానెల్స్ కు కేంద్రం నుండి ఎదురుదెబ్బ..?!

మొత్తం 20 యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు, రెండు వెబ్ సైట్లను కూడా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కావాలనే భారతదేశం పై తప్పుడు ప్రచారం చేస్తున్న కారణంగా 20 యూట్యూబ్ ఛానెల్స్, 2 వెబ్ సైట్లకు కేంద్రప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.

 Central Government Blocks 20 Youtube Channels And Two Websites Against It Act 20-TeluguStop.com

భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ పరాయి దేశం అయిన పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న 20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్ సైట్లను ఐటీ చట్టం 2021 ప్రకారం బ్లాక్ చేసింది.

ఈ యూట్యూబ్ ఛానెల్స్ అన్ని కూడా పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహాయంతోనే హిందూస్తాన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కనిపెట్టింది.

మన భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలను అవమానించడంతో పాటు భారత దేశాన్ని దూషించే లాగా వీడియోలను ప్రసారం చేస్తున్నాయని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్ అన్ని నయా పాకిస్థాన్ అనే పేరుతో ఇంతకాలం ప్రచారం కాబడుతున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.బ్లాక్ చేయబడిన ఛానల్స్ కు దాదాపు 2 మిలియన్‌ ల మంది సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు.

Telugu Central, Channels, Effect, Hatred, Pakistan, Websites, Youtube-Latest New

ఇలా దేశానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసినాగాని, దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీడియోలను పెడితే వారిని చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పింది సమాచార ప్రసార శాఖ.బ్లాక్ చేయబడిన ఛానెల్స్ అన్ని గత కొంతకాలంగా భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలు, దేశానికి చెందిన ప్రముఖు వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేసారు.భారత దేశంపై తప్పుడు ప్రచారం జరుగుతుందనే విషయాన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో అన్ని విచారణ జరిపి, సంబంధిత శాఖ అధికారులు అన్నింటిని  పరిశీలించి 20 యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు రెండు వెబ్ సైట్ లను కూడా బ్లాక్ చేసారు.ఎవరయినా సరే దేశానికి అపకీర్తి తెచ్చిన, దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన సహించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube