జమాతే ఇస్లామి సంస్థపై కేంద్రం నిషేధం! ఆస్తుల జప్తు!

కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థలకి సహకారం అందిస్తూ, కాశ్మీర్ లోయలో అల్లర్లు, ఉద్రిక్తతలకి కారణం అవుతున్న వేర్పాటు వాద సంస్థలు అయిన జమాతే ఇస్లామి, హురియత్ వంటి సంస్థల మీద కేంద్రం కన్నెర్ర చేసింది.ఉగ్రవాద కార్యకాలాపాలకి సహాకారం అందిస్తూ ఉగ్రవాదులకి ఆర్ధిక సాయం చేస్తున్న జమాతే ఇస్లామి అనే సంస్థ మీద కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళ నిషేధం విధించింది.

 Central Government Ban On Jamaat E Islami-TeluguStop.com

అలాగే ఆ సంస్థకి చెందిన సుమారు 52 కోట్ల విలువైన 70 ఆస్తులని కేంద్రం సీజ్ చేసింది.హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర వాద సంస్థకి జమాతే ఇస్లామి ఆర్ధిక సాయం చేస్తుందని ఎన్ఐఎ సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తుంది.

గత కొద్ది రోజులుగా వేర్పాటు వాదులు, వారి సంస్థల మీద ఎన్ఐఎ దాడులు చేసి సోదాలు నిర్వహిస్తుంది.ఈ సోదాల్లో జమాతే ఇస్లామి సంస్థ ఉగ్రవాదులకి ఆర్ధిక సాయం చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేంద్రం తక్షణం ఆ సంస్థ మీద నిషేధం విధించి ఆస్తులని కూడా సీజ్ చేసింది.

అలాగే ఆ సంస్థకి చెందిన 140 సభ్యులని ఎన్ఐఎ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.అలాగే హురియత్ మీద కూడా ఎన్ఐఎ ద్రుష్టి పెట్టి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ లో శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తున్న వేర్పాటు వాదులపై పూర్తిగా నిఘా పెట్టి కఠిన చర్యలకి కేంద్రం సిద్ధం కావడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube