విశాఖ రైల్వే జోన్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్!  

విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా ప్రకటన. .

  • ఏపీ ప్రజలు ఎంతో కాలంగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఏపీ విభజన హామీలలో భాగంగా బీజేపీ పార్టీ విశాఖ రైల్వే జోన్ ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయిన కూడా రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఒక్క మాట కూడా చెప్పలేదు. అయితే ఈ మధ్య కాలంలో విశాఖ రైల్వే జోన్ డిమాండ్ ఇంకా పెరిగింది. ఉత్తరాంద్ర ప్రజల ఆకాంక్షగా ఈ విశాఖ రైల్వే జోన్ వుంది.

  • ఇదిలా వుంటే తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ ఘోయల్ విశాఖ రైల్వేజోన్ ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ కి సౌత్ కోస్ట్ రైల్వేగా పేరు ఫిక్స్ చేసినట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. విశాఖ కేంద్రంగా వుండే ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వుంతాయాని, అలాగే వాల్తేర్ డివిజన్ ఇక నుంచి రాయిఘడ్ డివిజన్ గా పిలవబడుతుంది అని రైల్వే మంత్రి ప్రకటించాడు. ఎన్నికల ముందు, అది కూడా త్వరలో మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ఊహించని విధంగా బీజేపీ సర్కార్ విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రైల్వే జోన్ ప్రకటన రాగానే ఏపీలో వున్న ప్రధాన పార్టీలైన అధికార, ప్రతిపక్షాలు రైల్వే జోన్ తమ పోరాటం కారణంగానే వచ్చింది అని చెప్పుకోవడం మొదలుపెట్టాయి.