పుల్వామాలో ఉగ్రదాడిలో జవాన్ల కుటుంబాలకి కేంద్రం భారీ సాయం!  

పుల్వామా ఉగ్ర దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకి కోటి రూపాయిల ఆర్ధిక సాయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. .

  • పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందిన సంగతి అందరికి తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అయితే ఈ వైమానిక దాడులని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ఎత్తుల కోసం ఉపయోగించుకుంటున్న, వైమానిక చీఫ్ మాత్రం వాటిని చేసామని స్పష్టం చేసారు. ఇదిలా వుంటే ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకి ఆదుకోవడానికి చాలా మంది ముందుకొచ్చారు. ఎవరికి వారు తమకి తోచిన స్థాయిలో ఆర్ధిక సాయం ప్రకటించారు.

  • ఇదిలా వుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పుల్వామా ఉగ్ర దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకి భారీగా ఆర్ధిక సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయిలు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు రక్షణ ఫండ్ కి పంపించిన ఆర్ధిక సాయంని కూడా అధిస్తామని ప్రకటించింది. అలాగే పారామిలటరీ నిబంధనల ప్రకారం జవాన్ల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం, అలాగే స్థలం, వారసులకి పెన్సన్ కూడా అందించబోతున్నట్లు తెలుస్తుంది.