మరోసారి ఆధార్ - పాన్ కార్డ్ లింక్ గడువు పెంచిన కేంద్రం..!

మనలో చాలామందికి పాన్ కార్డు ఉండనే ఉంటుంది.అయితే దానిని ఆధార్‌ నెంబర్‌ తో దానిని లింక్ చేశారా మీరు ఇప్పటికైనా.? లింక్ చేయకపోతే ఇప్పుడే ఖంగారుపడకండి.! తాజాగా మనలాంటి లింక్ చేయని వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ గుడ్ న్యూస్ అందించింది.

 Central Government Again Extended Aadhar Pan Card Link Date , Aadhar Card, Pan C-TeluguStop.com

ఇదివరకు ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డును అనుసంధానం చేసే గడువు కాలాన్ని జూన్ 30, 2021 వ తేదీ వరకు వరకు గడువు విధించగా.అది మరికొన్నిరోజుల్లో అయిపొనుంది.

ఈ నేపథ్యంలో, ఆధార్ – పాన్ కార్డు అనుసంధానం గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా తెలిపింది.

కోవిడ్ వ్యాప్తి కారణంగా తలెత్తే ఇబ్బందులను తాము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

నిజానికి ఆధార్‌ తో పాన్ కార్డు అనుసంధానం చేసే గడువు జూన్ 30వ తేదీతో ముగియనుండగా.అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ మరోసారి పొడిగించింది.

ఎవరైతే మీ ఆధార్‌ నంబర్ ను పాన్‌ నెంబర్‌ తో అనుసంధానం చేయకపోతే SMS ద్వారా కూడా చేసుకోవచ్చు.అలకాకపాయిన.

మీ పాన్ కార్డ్ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి కూడా చేయవచ్చు.

సెక్షన్ 139 AA ప్రకారం ప్రతి పౌరుడు తమ ఆదాయ వివరాల సమర్పణ పత్రంలోనూ, పాన్ కార్డు దరఖాస్తు లోనూ ఆధార్ నెంబరు పొందపరచడం కచ్చితంగా మారింది.ఇకచివరగా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత ఎట్టి పరిస్థితులలో చెల్లుబాటు కావని కేంద్రం వివరించింది.

పాన్‌ – ఆధార్‌ లింక్‌ కోసం మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్​ చేసి మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్​ చేసిన తర్వాత.

స్పేస్​ ఇచ్చి మీ 10 అంకెల పాన్​ కార్డు నెంబర్​ ను ఎంటర్​ చేయాలి.ఆ పై 567678 లేదా 56161 నంబర్​ కు SMS పంపితేసరి.

దీంతో వెంటనే మీ ఆధార్‌ తో పాన్‌ కార్డు అనుసంధానం జరిగినట్లు మీ మొబైల్‌ నెంబర్‌ కు సందేశం వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube