సావంత్ రాజీనామా ను ఆమోదించిన కేంద్రం,ఆ భాద్యతలు అన్నీ జవదేకర్ కు  

Central Government Accepted Arvind Sawanth Resignation-arvind Sawanth Resignation,central Government,sivasena

కేంద్ర మంత్రి,శివసేన నేత అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.అయితే ఆయన రాజీనామా ను కేంద్రం ఆమోదం తెలిపి అరవింద్ సావంత్ భాద్యతలను ప్రకాష్ జవదేకర్ కు అప్పగించినట్లు తెలుస్తుంది.మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్సీపీ శివసేన కు మద్దతు తెలిపాలి అంటే ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలి అంటూ షరతు విధించడం తో ఒకేఒక్క శివసేన నేత కేంద్రమంత్రిగా ఉన్న అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు.

Central Government Accepted Arvind Sawanth Resignation-arvind Sawanth Resignation,central Government,sivasena Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Central Government Accepted Arvind Sawanth Resignation-Arvind Resignation Central Sivasena

మరోపక్క మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా గంట గంటకు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికలు ముగిసి దాదాపు నెల రోజులు కావస్తున్నప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోతున్నారు.భారీ మెజారిటీ సంపాదించినా బీజేపీ శివసేన మద్దతు కరువవడం తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక చేతులు ఎత్తేసింది.మరోపక్క శివసేన కూడా ఎన్సీపీ,కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టాలని భావించినప్పటికీ కాంగ్రెస్ శివసేన కు గట్టి ఝలక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు మూడో అతిపెద్ద పార్టీ గా సీట్లు గెలుచుకున్న ఎన్సీపీ గవర్నర్ అవకాశం ఇవ్వడం తో ఇక ఇప్పుడు అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది.మొత్తానికి మంగళవారం రాత్రి 8:30 గంటల వరకు ఎన్సీపీ కి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ డెడ్ లైన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మరి ఎన్సీపీ అయినా కూటమి కూడగట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకుంటుందో వేచి చూడాలి.