లోన్లు తీసుకున్న‌వారికి గుడ్‌న్యూస్  

good news for loan barriers, Central Governament, Bank Loans, Loan Barriers, Supreme Court, Chakravaddy, Lock Down, EMI\'s, RBI - Telugu Bank Loans, Central Governament, Chakravaddy, Emi\\'s, Good News For Loan Barriers, Loan Barriers, Lock Down, Rbi, Supreme Court

రుణ గ్ర‌హిత‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది.మార‌టోరియం కాలంకు సంబంధించిన రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

TeluguStop.com - Central Governament Bank Loans Loan Barriers

ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.మార‌టోరియం కాలానికి సంబంధించి రూ.2 కోట్ల వ‌ర‌కు ఉన్న రుణాల‌పై చక్ర‌వ‌డ్డీ మాఫీ చేయనున్న‌ట్లు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.దీనికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా తాజాగా విడుద‌ల చేసింది.

మార‌టోరియం కాలంలోని రుణాల‌కు సంబంధించిన చ‌క్ర‌వ‌డ్డీని మాఫీ చేయాల‌ని సుప్రీంకోర్టులో అనేక‌మంది పిటిష‌న్లు దాఖ‌లు చేశారు.

TeluguStop.com - లోన్లు తీసుకున్న‌వారికి గుడ్‌న్యూస్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

లాక్‌డౌన్ వ‌ల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, దీని వ‌ల్ల లోన్ల‌పై ఈఎంఐలు చెల్లించ‌డం క‌ష్టంగా మారడం వ‌ల్ల చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేయాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి.

ఈ పిటిష‌న్ల‌పై కొంత‌కాలంగా సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌డుతోంది.దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేసింది.

ఈఎంఐల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాల‌తో రూ.2 కోట్ల వ‌ర‌కు ఉన్న రుణాల‌పై చ‌క్ర‌వడ్డీ మాఫీ చేస్తున్న‌ట్లు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కాగా లాక్‌డౌన్ వ‌ల్ల కంపెనీలు క్లోజ్ కావ‌డం, చాలా కంపెనీలు ఉద్యోగాల‌ను తొల‌గించ‌డం, జీతాల్లో కోత విధించ‌డంతో లోన్ల ఈఎంఐల‌పై మార‌టోరియం విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో ఈఎంఐలు ఉన్న‌వారికి కాస్త ఊర‌ట ల‌భించింది.‌

.

#Bank Loans #Loan Barriers #EMI's #Supreme Court #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Central Governament Bank Loans Loan Barriers Related Telugu News,Photos/Pics,Images..