రేపు తెలంగాణాలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన !   Central Election Commission Tour In Telangana Tomorrow     2018-10-21   19:51:05  IST  Sai M

కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది. ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది. తొలిరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. అదే రోజు సీఈసీ, అధికారులతో సమీక్ష ఉంటుంది. 23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో, 24న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.