కేంద్ర కేబినెట్ ప‌ద‌వి ప‌వ‌న్‌కు చిన్న‌దంట‌.. మ‌రి ఇంకేం కావాలో!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పాలిటిక్స్ చాలా వేడిమీదున్నాయి.ప్ర‌తి ప‌క్షంలో బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య కాస్త గ్యాప్ పెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

 Central Cabinet Post Is A Small For Pawan What More Did Pawan Want, Pavan, Bjp,-TeluguStop.com

అయితే చాలా రోజుల నుంచి ప‌వ‌న్ క‌ల్యాన్‌ను కేంద్ర‌కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని చాలా వార్త‌లు వినిపిస్తున్నాయి.ఇక దీనిపై ఇప్ప‌టివ‌కు అటు బీజేపీ గానీ లేదా జ‌న‌సేన గానీ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

ఇక ప‌వ‌న్ కూడా మౌనంగా ఉండ‌టంతో నిజమే కావ‌చ్చు అని అంతా అనుకుంటున్నారు.కానీ ఇప్పుడు తాజాగా దీనిపై జ‌నసేన‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్వాత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నాదేండ్ల మ‌నోహ‌ర్ స్పందించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టి నుంచి ప్ర‌జ‌ల కోస‌మే పోరాడుతున్నార‌ని, అలాంటి నేత‌కు కేబినెట్ మంత్రి పదవి అంటే చాలా చిన్న‌ద‌ని, పైగా అది తాత్కాలిక‌మే అంటూ వ్యాఖ్యానించారు.అయితే నాదెండ్ల కామెంట్స్ కాస్త ఓవ‌ర్‌గా అనిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు, ఎందుకంటే రాష్ట్రంలో క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఏకంగా కేంద్ర కేబినెట్ ఇస్తార‌ని చెబుతున్నా అది కూడా తాత్కాళిక‌మే అంటే ఎలా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

బీజేపీ ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా క్ర‌మంగా బ‌ల‌ప‌డుతోంది.ఇక ఏపీలో రాబోయే కాలంలో బ‌ల‌ప‌డే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Telugu @bjp4india, Ap, Central, Janasena Pavan, Janasenapawan, Janasenabjp, Smal

మ‌రి అలాంట‌ప్పుడు బీజేపీతో దోస్తీ చేస్తే ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా భ‌విష్య‌త్ ఉంటుంది.కానీ ఇలా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కు పోతే ఆయ‌న‌కే న‌ష్టం అని జ‌న‌సైనికులు ఆవేద‌న తెలుపుతున్నారు.ఎందుకంటే ప‌వ‌న్‌కు ఉన్న ఇమేజ్‌కు బీజేపీ బ‌లం తోడైతే పార్టీ ఆర్థికంగానూ, ఇటు సామాజికంగానూ ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంది.కానీ వాటిని ప‌వ‌న్ మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు.

ఇలాగే ఇంకొంత కాలం తాప‌కో పార్టీతో పొత్తులు పెట్టుకుంటూ పోతే ప‌వన్‌పై జ‌నాల‌కు కూడా న‌మ్మ‌కం త‌గ్గుతుంది.చూడాలి మ‌రి ఇప్ప‌టికైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న వైఖ‌రిని మార్చుకుంటారా లేక ఇలాగే కొన‌సాగుతారా అని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube