బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారాన్ని భాజపా కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుందా?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే తెలుస్తుంది .ఒక ఒక కేంద్ర పార్టీ రాష్ట్రఅధ్యక్షున్ని ఈ స్థాయిలో దూకుడుగా అరెస్టు చేయడం వారెంట్ ఇష్యూ చేయకపోవడం, సరైన కారణాలు కూడా చెప్పకపోవడం ఇలా చట్టపకారం పాటించాల్సిన కనీసం నియమాలను పాటించలేదని భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి… ఆయన అరెస్టు కంటే కూడా అరెస్టు చేసిన విధానం ఎక్కువ సంచలనమైంది.

 Central Bjp Serious About Bandi Sanjay Arrest Issue, Bjp ,cm Kcr , ,bandi Sanjay-TeluguStop.com

అరెస్టు చేసి వందల కిలోమీటర్లు పోలీసు జీపులోనే తిప్పడం , జిల్లాలు దాటించి మరి కరీంనగర్ జైలు( Karimnagar Jail ) కి తరలించడం ఆ తరువాత వరంగల్ జడ్జి ( Warangal Judge )ముందు ప్రవేశపెట్టడం ఇలా బండి సంజయ్ వ్యవహారంలో చాలా నాటకీయ పరుణామాలు చోటుచేసుకున్నాయని చెప్పాలి.

Telugu Amit Shah, Bandi Sanjay, Cm Kcr, Jp Nadda, Karimnagar Jail, Kishan Reddy,

శాంతిభద్రతలు సాకుగా చూపి తమ నాయకుడి వ్యవహారంలో సినీ ఫక్కీలో వ్యవహరించిన పోలీసులు తీరుపై కమలనాధులు గుస్సా అవుతున్నారు.ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు.ఇప్పుడు ఈ వ్యవహారం పై కేంద్ర నాయకత్వం కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది .రాష్ట కీలక నాయకులతో ఫోన్లో సంభాషించిన అమిత్ షా( Amit Shah ) మరియు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) రాష్ట్ర ప్రబుత్వ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.పార్టీ అధ్యక్షుడు అరెస్టు సమయంలో పాటించాల్సిన ప్రాథమిక నియమాలను పాటించలేదని, కరీంనగర్ నుంచి నల్గొండ లోని పోలీస్ స్టేషన్ వరకు సంజయ్ను అవమానకరంగా తరలించాలని కనీస భద్రత నియమాలు పాటించలేదని , ఆయనను తరలించిన పోలీస్ స్టేషన్ కూడా ఒకప్పుడు నక్సలైట్లు దాడి చేసినదని ఇలా సంజయ్ పట్ల ప్రభుత్వం కక్ష కక్షపూరితంగా వ్యవహరించిందని కిషన్ రెడ్డి కేంద్ర నాయకత్వానికి వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.

Telugu Amit Shah, Bandi Sanjay, Cm Kcr, Jp Nadda, Karimnagar Jail, Kishan Reddy,

చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని, బండి సంజయ్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని ,రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళనలు పిలుపునివ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రనాయకులకు సూచనలు ఇచ్చారని తెలుస్తుంది ఏది ఏమైనా బండి సంజయ్ అరెస్ట్ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది .దీనికి కేంద్రం గా ఇక పరిణామాలు వేగం పుంజుకుంటాయని తెలుస్తుంది .తమ నాయకుడి పట్ల వ్యవహరించిన విదానం వల్ల ఇప్పటికే దెబ్బ తిన్న కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు మరింత దిగజరుతాయని మరిన్ని ప్రతీకార పరిణామాలకు దారి తీస్తాయని కొందరు అంచనా వేస్తునారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube