ఆ ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..కలెక్టర్ వెరిఫికేషన్ అయితే చాలు...

భారత దేశ వ్యాప్తంగా రోజు రోజుకు అనాధ పిల్లల సంఖ్య పెరుగుతోంది.ఆడ పిల్ల పుట్టిందని కొందరు, అక్రమ సంభందాల నేపధ్యంలో కన్న పిల్లలను చెత్త కుప్పలో పడేసే వారు ఇంకొందరు.

 Central Adoption Resource Authority New Guidelines For Nri, Nri, Adoption, Centr-TeluguStop.com

ఇలా కారణాలు ఏమైనా సరే తల్లి తండ్రులు ఉన్నా అనాధ ఆశ్రమాలలో అనాధలుగా ఉంటున్న పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది.అయితే వీరిని దత్తత తీసుకోవడం పై ప్రస్తుతం ఎంతో మంది ఆసక్తిని చూపుతున్నారు.

పిల్లలు లేని భార్యా భర్తలు , అలాగే ఒక సంతానం చాలు ఇంకొకరిని కనేకంటే దత్తత తీసుకుంటే బాగుంటుంది అనుకునే మనసున్న మారాజులు ఇలా ఎంతో మంది ఉన్నారు.కానీ

అనాదాశ్రామాలలో ఉండే పిల్లలను దత్తత తీసుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు.

అందుకు ఎన్నో రకాల అనుమతుల పత్రాలు ఉంటాయి.స్థానికులు కాకుండా విదేశాలలో ఉంటున్న మన ఎన్నారైలు ఇక్కడి నుంచీ పిల్లలను దత్తతు తీసుకువెళ్ళాలన్నా లేక విదేశీయులు దత్తత స్వీకారం చేపట్టాలన్నా అందుకు మరిన్ని అనుమతులు కావాల్సి ఉంటుంది.

ఈ నేపధ్యంలో ఎన్నారైలు దత్తత స్వీకారంను సులభతరం చేసేందుకు కేంద్రం తాజగా కొన్ని సవరణలు చేస్తూ కొత్త మార్గ దర్సకాలను జారీ చేసింది.

Telugu Cara, Centralresource-Telugu NRI

సెంట్రల్ అడాప్క్షన్ రిసోర్స్ అధారిటీ ఇందుకు గాను పలు మార్గ దర్సకాలను సూచించింది.హిందుత్వ దత్తత, నిర్వహణ చట్టం ప్రకారం వీటిని రూపొందించినట్టుగా తెలుస్తోంది.భారతీయ ఎన్నారైలకు, విదేశీయులకు పిల్లలను దత్తత ఇవ్వాల్సి వస్తే పాటించాల్సిన నియమ నిభంధనలను సిద్దం చేసింది సెంట్రల్ అడాప్క్షన్.

గతంలో పిల్లలను దత్తత తీసుకోవాల్సి వస్తే కోర్టు నుంచీ NOC తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురయ్యేవి, అలాగే ఎంతో సమయం పట్టేది.కానీ ఇకపై కోర్టు అనుమతులు లేకుండా సెంట్రల్ అడాప్క్షన్ రిసోర్స్ అధారిటీ నేరుగా NOC ఇచ్చేస్తుంది.

అయితే ఈ NOC వారు ఇవ్వాలంటే జిల్లా కలక్టర్ జరిపిన వెరిఫికేషన్ ఆధారంగానే NOC ఇస్తారని అధికారులు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube