వేర్వేరు వ్యాక్సిన్ తీసుకుంటే.. కేంద్రం నుండి కీలక ప్రకటన..!

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికి వచ్చే డౌట్ ఒక వ్యక్తి మొదటి డోస్ గా ఒక టీకా.రెండో డోస్ గా వేరే టీకా వేయించుకోవచ్చా అని.

 Central Administration Announced No Severe Effects Two Separate Vaccines For A P-TeluguStop.com

అయితే రెండు వేర్వేరు టీకాలను తీసుకునా సరే దాని ప్రభావం పెద్దగా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.యూపీలొ సిద్ధార్థ్ నగర్ జిల్లాలో కొందరికి మొదటి డోస్ కొవాగ్జిన్ ఇచ్చారట.

రెండో డోస్ గా కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారని సమాచార్మ్.అక్కడ 20 మందికి దాకా ఇలా వేర్వేరు టీకా ఇచ్చినట్టు తెలుస్తుంది.

వేర్వేరు టీకా ఇచ్చినప్పటికీ వారు బాగానే ఉన్నారట.వారి శరీరంపై అవి స్పల్పంగా ప్రభావం చూపించాయని తెలుస్తుంది.

వేర్వేరు వ్యాక్సిన్ తీసుకున్నా శరీరంపై అవి చూపించే ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ నిపుణుల బృందం చైర్మన్ డా.వీ.కె.పాల్ అన్నారు.అయితే ఈ విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు.పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదన్నారు.ఈ అంశాన్ని స్కూటినీ చేయాల్సి ఉందని చెప్పారు.సిద్ధార్థ్ నగర్ లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలా పొరపాటు జరిగిందని న్నారు.

మహారాష్ట్రలొ కూడా 72 ఏళ్ల వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ లు ఇచ్చారట.అయితే ఆయన శరీరంపై దద్దుర్లు ఏర్పడ్డాయని అతని కొడులు చెపాడు.

అయితే అతనికి ప్రాణాపాయం ఏమి లేదని డాక్టర్లు చెప్పారు.వేర్వేరు వ్యాక్సిన్ ప్రమాదం కాదు కాని రెండు డోస్ లు ఒకే వ్యాక్సిన్ తీసుకుంటేనే బెటర్ అని చెబుతున్నరు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube