స్వాతంత్ర దినోత్సవ వేడుక‌లపై కేంద్రం కీలక ప్రకటన..!

దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుత తరుణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

 August, Independence Day, Celebrations,-TeluguStop.com

అంతేకాకుండా ఈ క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించిన క‌రోనా వారియ‌ర్స్‌ని ఆగ‌స్టు15న నిర్వహించే స్వాతంత్ర్య వేడుక‌ల‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా పిల‌వాల‌ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తెలియజేసింది.

అయితే రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతాల్లో ఉద‌యం 9 గంట‌ల‌కు వేడుక‌ల‌ను నిర్వహించాలని కోరారు.

క‌రోనా దృష్ట్యా భారీ స్థాయిలో జ‌నం వేడుక‌ల్లో పాల్గొన‌కుండా చూడాల‌ని అన్ని రాష్ట్రాలకు తెలియజేశారు.స్వాతంత్ర్య వేడుక‌ల్లో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించే పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మాస్క్ ధ‌రించాల‌ని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఎర్రకోట వద్ద నిర్వహించే వేడుకలను కూడా పరిమితంగా నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తుంది.ఈ వేడుకలకు హాజరయ్యే వీవీఐపీలు కేవలం 20 శాతం మంది మాత్రమే హాజరు అవుతారని తెలిపారు.

ఈ వేడుకలకు విద్యార్ధులు గాని స్థానిక పిల్లలుగాని ఎవరూ హాజరయ్యే అవకాశం లేదని అర్ధం అవుతుంది.

ఈ వేడుకలకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్లు హాజరవుతారని తెలుస్తుంది.

ఇక కరోనా విజేతలు 1500 మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.స్థానిక పోలీసులు 500 మంది ఉంటారు అని వివిధ ప్రాంతాలకు చెందిన వెయ్యి మంది ఉంటారని సమాచారం.

ఇంకా మొత్తంగా ఈ వేడుకలకు 2 వేల మంది లోపే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube