కరోనా లక్షణాలు కనిపించకపోతే మరీ ప్రమాదమా..?  

Not having corona symptoms is dangerous, Corona Symptoms, Corona pandemic, Survey, DNA Fingerprints - Telugu Asymptomatic Corona Cases, Centre For Dna, Corona Pandemic, Corona Survey, Corona Symptoms, Corona Virus, Dna Fingerprints, Not Having Corona Symptoms Is Dangerous, Survey

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.

TeluguStop.com - Center For Dna Fingerprints Survey Corona Pandemic

వైరస్ విజృంభించిన తొలినాళ్లలో వందల సంఖ్యలో కేసులు నమోదు కాగా ప్రస్తుతం దేశంలో లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి.ప్రస్తుతం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లోనే కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది.

శాస్త్రవేత్తలు వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి అనేక ప్రయోగాలు చేస్తున్నారు.

TeluguStop.com - కరోనా లక్షణాలు కనిపించకపోతే మరీ ప్రమాదమా..-General-Telugu-Telugu Tollywood Photo Image

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్ తాజాగా కరోనా వైరస్ గురించి కీలక విషయాలను వెల్లడించింది.తమ పరిశోధనల్లో లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడ్ ఎక్కువగా ఉందని తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.20 బి క్లేడ్‌ స్ట్రెయిట్ రకం వైరస్ కరోనా లక్షణాలు లేని వారిలో కనిపిస్తోందని.వైరస్ లోడ్ వల్ల లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే లక్షణాలు లేని వారికి మరీ ప్రమాదమని వెల్లడిస్తున్నారు.

210 మంది డేటాను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.కరోనా లక్షణాలు కనిపించని వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వైరస్ నుంచి కోలుకోవడం సాధ్యమవుతుందని.ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే కోలుకోవడం కష్టమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని వెల్లడించారు.

కరోనా లక్షణాలు కనిపించని వారి నుంచి వృద్ధులు, పిల్లలు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

‘బయో ఆరెక్సీవ్‌’ అనే ప్రీప్రింట్‌ రీపాజిటరీలో ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయి.కరోనా సోకిన వారిలో 95 శాతం మందిలో బిక్లేడ్‌ అనే స్ట్రెయిన్‌కు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలగా 5 శాతం మందికి ఇతర స్ట్రెయిన్‌ లకు సంబంధించిన వైరస్ సోకినట్లు తేలింది.

తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

#Centre For Dna #NotHaving #Corona Virus #Corona Symptoms #Corona Pandemic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Center For Dna Fingerprints Survey Corona Pandemic Related Telugu News,Photos/Pics,Images..